పాటవింటే చాలు వండేయొచ్చు!

23 Jun, 2019 10:35 IST|Sakshi

ఆర్‌ యూ హంగ్రీ? ఆర్‌ యూ హంగ్రీ?...అయితే పాటేస్కోండి చాలు... క్షణాల్లో మీ చేతులు మీకు తెలయకుండానే లయబద్ధంగా గరిటెతిప్పుతాయి. ఇదే చిట్కాతో వంటలపాటలను పాడేస్తూ కేరళ ఉర్ల్‌ కళంగ్‌ కర్రీ, తెలుగువారి దద్ధోజనం, ఆలూ పాస్తా, మటన్‌ బిర్యానీ, చిన్నారులు మెచ్చే బట్టర్‌ చికెన్‌ ఏదైనా సరే క్షణాల్లో వండేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తున్నారు బెంగాలీ ఆంటీ సావన్‌దత్తా. ఇష్టంగా చేస్తే వంట కూడా ఒక కళ.

ఆ కళ వంట బట్టాలంటే బోర్‌కొట్టే రొటీన్‌ వంటల కార్యక్రమంలా కాకుండా సరికొత్తగా వంటబట్టించాలనుకున్న సావన్‌ దత్‌ అనే బెంగాలీ ఆంటీ ఏపీ, తెలంగాణలతో సహా దక్షిణాది స్పెషల్‌ వంటకాలతో భోజనప్రియులను వంటింట్లోకి నడిపించేస్తున్నారు. ఇప్పటికే కుప్పలుతెప్పలుగా యూట్యూబ్‌లో వంటలకార్యక్రమాలుంటే ఇందులో కొత్తేముందీ అనుకోకండి. ఇక్కడ వంటలన్నీ పాటల రూపంలో ఉంటాయి. వంటకు కావాల్సిన పదార్థాల నుంచి, వండే విధానం వరకూ అందమైన బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి హావభావాలతో వండిచూపించడమే సావన్‌ దత్తా స్పెషాలిటీ. బెంగాలీ ఫ్యావరెట్‌ వంటకాలైన ఝల్‌మురీ, కలకత్తా మటన్‌ బిర్యానీ, కోశా మాంగ్సో, సహా దత్తా వీడియో వంటకాలు పాటల రూపంలో హోరెత్తిస్తున్నాయి. ఆమె రిలీజ్‌ చేస్తోన్న ఒక్కో పాటా ఒక్కో కొత్త ప్రదేశంలో, కొత్త మ్యూజిక్‌తో సరికొత్తగా ప్రారంభం అవుతుంది. దత్తా ‘‘సాంగ్‌ బ్లాగ్‌’’పేరు మెట్రోనోమ్‌. ఇంకేం, ఆర్‌ యూ హంగ్రీ... ఆర్‌ యూ హంగ్రీ అంటూ ఓ పాటేసుకోండి మరి.

మరిన్ని వార్తలు