నిత్యానందకు సుప్రీంలో చుక్కెదురు..

1 Jun, 2018 19:20 IST|Sakshi
నిత్యానంద(పాత చిత్రం)

న్యూఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2010లో నిత్యానందపై అత్యాచార కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి విముక్తి  కల్పించాలనే ఆయన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్‌లను కూడా కోర్టు తిరస్కరించింది.

తనపై గల నేరాఆరోపణలపై పునర్విచారణ చేపట్టాల్సిందిగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాల్సిందిగా నిత్యానంద  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కాగా కర్ణాటక హైకోర్టు ఆయన పిటిషన్‌ను మే 16న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సోమవారం సుప్రీంను ఆశ్రయించారు.

తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో 2010 ఏప్రిల్‌లో అరెస్ట్‌ అయిన నిత్యానందకు, బెయిల్‌ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు