‘యూపీ సర్కార్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం’

2 Jul, 2019 19:21 IST|Sakshi

లక్నో : పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఇప్పటికే తప్పుపట్టగా, కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ సైతం యూపీ సర్కార్‌ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 17 అత్యంత వెనుకబడిన కులాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న యూపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

కోర్టు సైతం సహేతుకం కాదని ప్రకటించిన ఈ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని మంత్రి కోరారు. రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్పీ సభ్యుడు సతీష్‌ మిశ్రా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. రాజ్యాంగంలోని 341 సెక్షన్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారానే ఎస్సీ జాబితాలో ఎలాంటి మార్పుచేర్పులైనా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు