పాక్ నుంచి వెనక్కొచ్చిన షర్మిళ

23 Feb, 2016 09:12 IST|Sakshi
పాక్ నుంచి వెనక్కొచ్చిన షర్మిళ
లాహోర్: పాకిస్తాన్‌లో ఉండేందుకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించినప్పటికీ నటి, సైఫ్ అలీఖాన్ తల్లి షర్మిళ ఠాకూర్ భారత్‌కు వెనక్కి వచ్చారు. ట్రావెల్ డాక్యుమెంట్లలో పోలీస్ రిపోర్టు లేదన్న కారణంతో ఆదివారం వాఘా సరిహద్దు వద్ద ఎఫ్‌ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు.. పాక్‌లో ఉండేందుకు షర్మిళకు అనుమతినివ్వలేదు.
 
దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి షర్మిళతో పాటు ఉన్న అధికారులు ఫాక్స్ ద్వారా ‘రిపోర్టు’ను తెప్పించారు. షర్మిళ తన పర్యటనలో భాగంగా లాహోర్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. తమ నివాసం ‘జతి ఉమ్రా’లో తమ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయాల్సిందిగా ఆమెను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. అయితే అధికారుల తీరుతో మనసు మార్చుకున్న షర్మిళ.. భారత్‌కు వెనక్కి వచ్చేశారు.
మరిన్ని వార్తలు