బడ్జెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన శశి థరూర్‌

1 Feb, 2019 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌ ప్రక్రియ మొత్తం ఒక వ్యంగ్య రచనలా సాగిందని ఆరోపించారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా బడ్జెట్‌ తీరును వర్ణించారు. మధ్యతరగతి ప్రజలకు కల్పించిన పన్ను మినహాయింపు మాత్రమే తమకు సంతృప్తినిచ్చిందన్నారు.

అంతేకాక బడ్జెట్‌లో రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంటే రైతుకు నెలకు కేవలం 500 రూపాయలు ఇస్తున్నారు. ఇంత తక్కువ మొత్తంతో వారు గౌరవంగా, డిగ్నిటీగా ఎలా జీవిస్తారని అడిగారు. నెలకు రూ. 500లు ఇస్తే రైతు ఆదాయం రెట్టింపవుతుందా అంటూ శశి థరూర్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు