సీబీఐ కస్టడీలో పీటర్ ముఖర్జీయా

20 Nov, 2015 15:42 IST|Sakshi

ముంబై: క్రైమ్ థ్రిల్లర్ మూవీలా మలుపులు తిరుగుతున్న షీరాబోరా హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి  భర్త పీటర్ ముఖర్జియాను  సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు పీటర్ ను ప్రశ్నించనున్నారు.  ఇప్పటికే ఇంద్రాణి ముఖర్జియా సహా ముగ్గురిపై  కేసులు నమోదు  చేసిన  సీబీఐ, తాజాగా ఆమె ప్రస్తుత భర్త, స్టార్ గ్రూప్ అధినేత పీటర్ ముఖర్జియాను  ఏ-4 గా చేర్చింది.

నిన్న పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అతడిని కోర్టులో హాజరు పరిచారు. కాగా షీనాబోరా హత్య విషయం తెలిసినా నిజం బయటపడకుండా పీటర్ ముఖర్జియా దాచి పెట్టారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న  షీరా బోరా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, ఇంద్రాణి  మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు  సీబీఐ కోర్టు... డిసెంబర్ 3వ తేదీ వరకు కస్టడీని  పొడిగించింది. గత   ఆగస్టులో  సీబీఐ వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు