వైన్ ‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర

4 May, 2020 11:04 IST|Sakshi

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.(మద్యం ధరలు 30 శాతం పెంపు)

చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గాన్‌లోని సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్‌ 3.0 నిబంధనలకు అనుగుణంగా కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్‌ షాప్‌ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు.(‘బారు’లు తీరిన మందుబాబులు)

కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 

మరిన్ని వార్తలు