సుందర్‌ పిచాయ్‌: ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ

16 Jul, 2020 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ అంటూ సుందర్‌ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ లో రెండు విభిన్న ఫోటోలను పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో నిజ జీవితంలో జరిగే విషయాలు, సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వాటి మధ్య బేధం ఎలా ఉంటుందో తెలుపుతూ పేర్కొన్నారు. ఈ ఫోటో చూస్తుంటే ఓ వీడియో కోసం షూటింగ్‌ చేస్తున్నప్పుడు తీసినట్లు తెలుస్తోంది. మొదటి ఫోటోలో జూమ్‌ షాట్‌లో స్టిల్‌ కోసం నవ్వుతూ కెమెరా వైపు చూస్తూ నిలుచున్నారు. రెండో దాంట్లో ఫుల్‌ షాట్‌లో కెమెరా వెనకల తన ఫోన్‌ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ ఫోటో ద్వారా కెమెరా ముందు కనిపించే వ్యక్తికి అసలైన వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది అనే కోణంలో ఈ రెండు ఫోటోలను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. (భారత్‌కు గూగుల్‌ దన్ను!)

IG vs. reality...comfy shoes + checking on @fcbarcelona scores between takes:)

A post shared by Sundar Pichai (@sundarpichai) on

అయితే సుందర్‌ కంటే ముందు కూడా చాలా మంది ఇలాంటి ఫోటోలను షేర్‌ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 2.5 లక్షల మంది లైక్‌ చేయగా.. 1500 మంది కామెంట్‌ చేశారు. ‘మీరు మా టీమ్‌లో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అని ఎఫ్‌సీ బార్సిలోనా పేర్కొంది. కాగా సుందర్ పిచాయ్ నేతృత్వంలోని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ వచ్చే ఐదారేళ్లల్లో భారతదేశంలో రూ.75వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పెట్టుబడులను డిజిటైజేషన్ ఫండ్‌ పేరుతో పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది. (యూట్యూబ్‌తో సుందర్‌ పిచాయ్‌ అనుబంధం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా