రఫెల్‌ డీల్‌ తీర్పుపై రివ్యూకు సుప్రీం అంగీకారం

21 Feb, 2019 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ: రఫెల్‌ డీల్‌పై తీర్పును రివ్యూ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. రఫెల్‌ ఒప్పందంపై గతేడాది డిసెంబర్‌ 14న తీర్పును వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహరంలో కేంద్రం తీరును సమర్ధించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ అవకతవకలు జరిగనట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం.. చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పనిలేదని పేర్కొంది. వివాదస్పద రఫెల్‌ డీల్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు సరైన సమాచారం ఇవ్వకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

కాగా, వీటిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తీర్పును రివ్యూ చేసేందుకు అంగీకారం తెలిపారు. రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని.. ఇందుకోసం  ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రఫెల్‌ డీల్‌పై డిసెంబర్‌లో సుప్రీం ఇచ్చిన తీర్పు: రఫేల్‌ ఒప్పందం సక్రమమే

మరిన్ని వార్తలు