నీట్ నుంచి ప్రైవేట్ కాలేజీలకు మినహాయింపు

11 Apr, 2016 15:55 IST|Sakshi
నీట్ నుంచి ప్రైవేట్ కాలేజీలకు మినహాయింపు

మెడికల్ కోర్సులో చేరేందుకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి ప్రైవేట్ కాలేజీలను మినహాయిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న 600 మెడికల్ కాలేజీలపై ప్రభావం చూపనుంది. నీట్ ద్వారానే కాక విద్యార్థులను వేరే టెస్ట్ లు నిర్వహించి కూడా కాలేజీల్లో చేర్చుకోవచ్చని కోర్టు పేర్కొంది.

ఇప్పటివరకూ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలకు ఒకే పరీక్షను నిర్వహించేవారు. అయితే ఈ కామన్ ఎంట్రన్స్ సరికాదని 2013లో నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మొదట కామన్ టెస్ట్ కే మొగ్గు చూపిన సుప్రీం... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరిక మేరకు ఆ పిటిషన్ ను పున: విచారించింది. ఈ రివ్యూ విచారణలో నీట్ ఎంట్రన్స్ నుంచి ప్రైవేట్ కాలేజీలను మినహాయించింది.

మరిన్ని వార్తలు