ఐఐటీ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే

7 Jul, 2017 14:41 IST|Sakshi
ఐఐటీ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నాపత్రంలో 18 తప్పుడు ప్రశ్నలకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఐఐటీ-జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. దేశవ్యాప్తంగా 33 వేల మంది విద్యార్థులపై తీర్పు ప్రభావం పడనుంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు