ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్‌ పెడతాం!

30 Nov, 2018 14:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ వచ్చిన ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. (ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్‌)

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లులో పొందపరచాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను ఇప్పటికే రద్దు చేశామని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు