‘తాజ్‌‌’ను వేలం వేయాల్సిందే’

20 Apr, 2017 16:12 IST|Sakshi
‘తాజ్‌‌’ను వేలం వేయాల్సిందే’

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రముఖ తాజ్‌మహల్‌ హోటల్‌(తాజ్‌ మాన్‌సింగ్‌)ను వేలం వేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టాటా గ్రూపు నడుపుతున్న ఈ హోటల్‌కు సంబంధించిన 33 ఏళ్ల అద్దె ముగియడంతో దానిని ఖాళీ చేయాలని తెలిపింది. అయితే, వేలంలో టాటా గ్రూపు పాల్గొని దానిని దక్కించుకోలేకపోతే ఖాళీ చేసేందుకు ఆరు నెలల సమయం ఉంటుందని కూడా వివరించింది. ఢిల్లీలో తాజ్‌ మాన్‌సింగ్‌గా పేరొందిన ఈ హోటల్‌ను 33 ఏళ్లపాటు టాటా గ్రూపు అద్దెకు తీసుకొని నడుపుతోంది.

ఆ గడువు 2011లో ముగిసినప్పటికీ పలుమార్లు పొడిగించుకుంటూ ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు అవకాశం పొందింది. అయితే, గత నెల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రత్యేక అధికారులతో సమావేశం అయ్యి ఈ హోటల్‌ను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలం వేయకుండానే తమకు మరోసారి లీజ్‌ను పొడిగించాలంటూ టాటా సంస్థ కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ వేలానికి వెళ్లాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేజ్రీవాల్‌ నిర్ణయానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

>
మరిన్ని వార్తలు