కృష్ణా జలాల వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

1 Dec, 2023 15:50 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు కోర్టు వాయిదా వేసింది. 

అయితే, కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధి విధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు మరింత సమయం కేంద్ర జలశక్తిశాఖ న్యాయవాది.. సుప్రీంకోర్టును కోరారు. దీంతో, విచారణను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి

మరిన్ని వార్తలు