యూసీసీ అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు

1 Dec, 2023 18:15 IST|Sakshi

న్యూ ఢిల్లీ : యూనిఫాం సివిల్‌ కోడ్‌(యూసీసీ) అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూసీసీని అమలు చేయాలని దాఖలైన పిటిషన్‌లను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. కొత్త చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం వంటి విషయాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా హై కోర్టు వ్యాఖ్యానించింది. 

యూసీసీ అమలు విషయంలో ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఉటంకించింది. యూసీసీ అమలు చేయాలన్న పిటిషన్లను అప్పట్లో సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించేందుకు మాండమస్‌ రిట్‌ను జారీ చేయలేమని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో అమలవతున్న పర్సనల్‌ లా చట్టాలన్నింటిని కలిపి అందరికీ ఒకే చట్టంగా యూసీసీని తీసుకురావాలనేది బీజేపీ ఆలోచన. ఇదే విషయాన్ని పార్టీ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంటూ వస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో మత ‍ఆచారాల ఆధారంగా పర్సనల్‌ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలా కాకుండా అందరికీ వర్తించేలా ప్రతిపాదనలో ఉన్న చట్టమే యూసీసీ.  

ఇదీచదవండి..బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయితే: నాపై ట్రోలింగ్‌, బెదిరింపులు


 

మరిన్ని వార్తలు