మళ్లీ నేనే సీఎం.. నాలుగోసారి మాదే హవా!

19 May, 2016 07:51 IST|Sakshi
మళ్లీ నేనే సీఎం.. నాలుగోసారి మాదే హవా!

గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని, అందుకే వాటిని తాను అంగీకరించనని చెప్పారు. గతంలోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని ఎన్నో పర్యాయాలు నిరూపితమైందని పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించానని నేటి ఫలితాలలో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ గెలుపుతో వరుసగా నాలుగోసారి సీఎం తానే అవ్వనున్నట్లు చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా చేసిందేమి లేదన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నించారు. మరోవైపు అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడయ్యాయి.

మరిన్ని వార్తలు