Tweets On TS Election Results: నయా పాలి‘ట్రిక్స్‌’.. గెలిచేది సారే.. వచ్చేది కారే!

2 Dec, 2023 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నిలక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ ఉందని ఎక్కువ సంఖ్యలో ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో సైలెంట్‌ వేవ్‌తో బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ క్రమంలో బెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ తాజాగా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగానే సెలైంట్‌ వేవ్‌తో తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని గెలిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. 

మరోవైపు.. కొందరు సోషల్‌ మీడియాలో వేదికగా కూడా కేసీఆర్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నిలకల్లో ‘చేయి’ ఎత్తి ‘కారు’ను  ఆపడం సాధ్యమేనా అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎవరి విశ్లేషణలో వారు బిజీగా ఉన్నారు. మరోవైపు, గెలుపు ఓటములు ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తూ పంచ్‌లు విసురుతున్నారు. 

ఇక, థర్డ్‌ విజన్‌ నాగన్న సర్వే ఎగ్జిట్‌పోల్స్‌ కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా సమీకరణాలను వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ దాదాపు 60-68 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు 33-40 సీట్లు వస్తామయని తెలిపింది. 

మరిన్ని వార్తలు