కాంగ్రెస్‌, అకాలీలు తన్నుకున్నారు

6 Feb, 2017 13:06 IST|Sakshi

అమృతసర్‌: పంజాబ్‌లో తొలి రాజకీయ పంచాయితీ చోటుచేసుకుంది. అధికార పార్టీ శిరోమణి అకాలీదల్‌కు చెందిన కార్యకర్తలు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు తన్నుకున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. మజీతియా నియోజకవర్గంలోని మియాన్‌ పందేర్‌ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది.

ఫిబ్రవరి 4న జరగాల్సిన ఎన్నికలు పూర్తయిన అనంతరం ఈ సంఘర్షణలు చోటుచేసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. ఇటుకలు, రాళ్లు ఇరు వర్గాలు రువ్వుకున్నాయని, కొంతమందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో అకాళీదల్‌ నేత, రెవెన్యూ మంత్రి బిక్రమ్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లల్లీ మజీతియా తలపడుతున్నారు.

మరిన్ని వార్తలు