మధుమేహ రోగుల కోసం కొత్తరకం బియ్యం

12 Dec, 2015 05:55 IST|Sakshi
మధుమేహ రోగుల కోసం కొత్తరకం బియ్యం

రాయ్‌పూర్: మధుమేహ రోగులకు అన్నం ప్రధాన శత్రువుగా మారిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించేలా పరిశోధకులు గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాన్ని కనిపెట్టారు. ఇది మధుమేహ రోగులకే కాకుండా సాధారణ ప్రజలకూ ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుందన్నారు. రాయపూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని రూపొందించారు. వచ్చే నెల వీటిని వాణిజ్య ప్రాతిపదికన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో సంప్రదాయంగా సాగుచేసే ‘చపాతీ గుర్మతీయ’ అనే వరి రకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని తయారు చేసినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన గిరీశ్ చందెల్ తెలిపారు.  వరి ప్రధాన ఆహార వనరుగా ఉన్న మన దేశంలో ఈ కొత్త ఆవిష్కరణ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు