గోయల్‌ నోట పదేపదే ‘కోట్ల’ మాట

1 Feb, 2019 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ  : బడ్జెట్‌ అంటేనే గణాంకాల గారడీ. అంకెలతో కుస్తీ, పద్దులు ఖాతాలపై కసరత్తే అధికంగా కనిపిస్తుంది. పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ అడుగడుగునా పదాల వల్లెవేత సాగింది. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ పలుమార్లు కోట్లు, ప్రభుత్వం, భారత్‌, పన్ను వంటి పదాలను అధికంగా వాడారు.

బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన కోట్లు అనేపదాన్ని ఏకంగా 80 సార్లు ప్రయోగించగా, విల్‌ అనే మాటను 76 సార్లు, ప్రభుత్వం అనే పదాన్ని 60 సార్లు వాడారు. ఇక పన్నును 46 సార్లు, లక్షలను 32 సార్లు బడ్జెట్‌ స్పీచ్‌లో ప్రస్తావించారు. ఇక సంవత్సరం అనే పదాన్ని 29 సార్లు, కూడా అంటూ 28 సార్లు మాట్లాడారు. పెంపు అనే పదాన్ని 23 సార్లు ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు