ఆమెకు మోదీ 'నరేంద్ర భాయ్‌'

7 Aug, 2017 16:50 IST|Sakshi
ఆమెకు మోదీ 'నరేంద్ర భాయ్‌'

న్యూఢిల్లీ: ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ. పెళ్లి అయిన తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్న ఆమె గత 22 ఏళ్లుగా ఇక్కడే రాఖీ ఉత్సవం జరుపుకుంటోంది. కచ్చితంగా ఓ వ్యక్తికి ఆమె రాఖీ కడుతుంటుంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం అలా జరుగుతుందో లేదో అని కాస్త ఆందోళన పడింది. అయితే, ఆమె ఆందోళనను తలగిందులు చేస్తూ ఆ వ్యక్తి నుంచి రాఖీ కట్టేందుకు ఆహ్వానం అందింది. దీంతో ఆమె మనసులోని ఆందోళన స్థానంలో ఆనందం వెళ్లి విరిసింది. ఇంతకీ ఆమెతో రాఖీ కట్టించుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు.. మన ప్రధాని నరేంద్రమోదీ. అవునూ, ఖమర్‌ మోసిన్‌ షేక్‌ అనే మహిళ గత 22 ఏళ్లుగా నేటి ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారంట.

మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆరెస్సెస్‌) కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆమె మోదీకి రాఖీ కడుతున్నారంట. అయితే, ప్రస్తుతం ఎన్నికల హడావుడితోపాటు విదేశీ పర్యటనలు, ప్రధాని హోదాలో మరింత బిజీ అవడంతో ఈసారి అవకాశం ఉంటుందో ఉండదో అని భావించిన ఆమెకు సరిగ్గా రెండు రోజుల కిందటే ఆహ్వానం అందిందట. ఈ సందర్భంగా ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే పరిశీలిస్తే..

'నేను 22 నుంచి 23 ఏళ్లుగా నరేంద్ర భాయ్‌కి రాఖీ కడుతున్నాను. కానీ, ఈసారి మరింత ఉత్సాహంతో ఉన్నాను. నేను తొలిసారి రాఖీ కట్టినప్పుడు భాయ్‌ ఆరెస్సెస్‌ కార్యకర్తగా ఉన్నారు. ఆయన కఠిన శ్రమ, దూరదృష్టికారణంగా ప్రధాని అయ్యారు. ఈ ఏడాది మాత్రం నాకు ఆయన నుంచి ఫోన్‌ వస్తుందని ఊహించలేదు. కానీ, ఇంత బిజీలో ఉండి కూడా రెండు రోజుల కిందటే నాకు ఆయన నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో నాకు అమితానందంగా ఉంది. ప్రస్తుతం నేను రక్షాబంధన్‌ ఏర్పాట్లలో ఉన్నాను' అంటూ ఆమె చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్‌ నిర్ణయం

ఎస్‌ఎంఎస్‌కు స్పందించిన సీఎం.. బాలుడు సేఫ్‌..!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

‘ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి’

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..

సోన్‌భద్ర కాల్పులు : కీలక పత్రాలు మాయం

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

బాలుడికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తారా?

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!