కాశ్మీర్లో కాల్పులు: ముగ్గురు జవాన్లు మృతి

26 Aug, 2014 09:47 IST|Sakshi

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో వేర్వేరు చోట్ల భారత్ బలగాలు, పాక్ తీవ్రవాదులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో ముగ్గురు జవాన్లు మరణించగా, ఐదుగురు పాక్ తీవ్రవాదులు హతమయ్యారు. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అతడిని శ్రీనగర్లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. 

కుప్వారా జిల్లాలో పాక్ తీవ్రవాదులు ఆశ్రయం పొందినట్లు భారత్ జవాన్లు సమాచారం అందింది. దాంతో జిల్లాలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు భారత జవాన్లపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. వెంటనే జవాన్లు అప్రమత్తమై... తీవ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు జవాన్లు మరణించారు. ఐదుగురు పాక్ తీవ్రవాదులు మరణించారు.  మరణించిన పాక్ తీవ్రవాదుల వద్ద భారీగా ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారత్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు