దెబ్బ‌కు టిక్‌టాక్‌కు దిమ్మ‌తిరిగిపోయింది

19 May, 2020 19:00 IST|Sakshi

కొంప‌ముంచిన‌ "యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌"

ప్లేస్టోర్‌లో పెరుగుతున్న 1.0 రేటింగ్స్‌

టిక్‌టాక్‌పై ఉద్య‌మించిన యూట్యూబ్ అభిమానులు

టిక్‌టాక్‌కు ఊహించ‌ని దెబ్బ ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కూ టాప్ రేటింగ్‌తో, దుమ్ము దులిపే డౌన్‌లోన్ల‌తో దూసుకుపోయిన టిక్‌టాక్‌కు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ యాప్ రేటింగ్ ఇప్పుడు రెండుకు ప‌డిపోయింది. ఇంత దారుణ‌మైన రేటింగ్‌ను టిక్‌టాక్ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌దు. మ‌రి అలాంటి పాపుల‌ర్‌ యాప్‌కు ఇప్పుడెందుకీ ప‌రిస్థితులు దాపురిచించాయో తెలుసుకుందాం...

ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ప్ర‌ధాన అంశం "యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌". నెట్టింట ఈ ఫైట్ హోరాహోరీగా సాగుతున్న‌ప్ప‌టికీ యూట్యూబ్‌దే పైచేయి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. దానికి టిక్‌టాక్ రేటింగే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఎల్విష్ యాద‌వ్ అనే యూట్యూబ‌ర్ టిక్‌టాక్ యూజ‌ర్ల‌ను చెత్త‌తో పోలుస్తూ ఓ వీడియో చేశాడు. దీంతో ఆగ్ర‌హం చెందిన అమీర్ సిద్ధిఖీ అనే టిక్‌టాక్ యూజ‌ర్‌.. యూట్యూబర్లకు ఏదీ చేత కాదంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడాడు. ఇది విన్నాక యూట్యూబ‌ర్లు ఊరుకుంటారా? టిక్‌టాక‌ర్ల‌ను అన్ని కోణాల్లోనూ  చెడుగుడు ఆడేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ యూట్యూబ‌ర్ క్యారీమినటీ‌. అత‌ను మే 8న "యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌" పేరిట‌ అప్‌లోడ్ చేసిన‌ రోస్టింగ్‌ వీడియోకు వ‌చ్చిన లైకులు, కామెంట్లు, వ్యూస్ ప్ర‌తీది రికార్డే. (వ్యూయర్‌లు పడి చస్తారు... ఆ తొక్కలో ఎక్స్‌ప్రెషన్‌కి)

అయితే ఏమైందో ఏమో కానీ, ఎన్నో ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకున్న వీడియో మే 14 నుంచి యూట్యూబ్‌లో క‌నిపించ‌కుండా పోయింది. ఊహించ‌ని ప‌రిణామంతో క్యారీమిన‌టి క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. అది చూసిన‌ అత‌ని భార‌త‌ యూట్యూబ్ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. అతని బాధ‌కు కార‌ణ‌మైన వారిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నారు. క్యారీమిన‌టి వీడియో డిలీట్ చేయ‌డానికి కార‌ణ‌మైన టిక్‌టాక్‌ను ఊరుకునేది లేద‌ని సోష‌ల్ మీడియాలో మంగ‌మ్మ‌ శ‌ఫ‌థం చేశారు. ఈ మేర‌కు టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చీప్ రేటింగ్(1.0) ఇచ్చి డిలీట్ చేయాల‌ని ఓ ఉద్య‌మ‌మే న‌డిపారు. దీంతో 4.6తో టాప్‌లో ఉన్న టిక్‌టాక్ రేటింగ్ ఇప్పుడు రెండుకు దిగ‌జారిపోయింది. రానున్న రోజుల్లో ఇది మ‌రింత పాతాళానికి ప‌డిపోయే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఈ దెబ్బ‌కు కోమాలోకి పోయిన‌ట్లున్న టిక్‌టాక్ ఈ విప‌త్తు నుంచి ఎలా కోలుకుంటుందో, ఎలా ఎదుర్కోనుందో చూడాలి. (యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌: గెలుపెవ‌రిది?)

Poll
Loading...
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు