నేటి ముఖ్యాంశాలు..

17 Jun, 2020 06:36 IST|Sakshi

జాతీయం :
భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు
తూర్పు లద్దాఖ్‌ గాల్వన్‌లోయ ప్రాంతంలో భారత గస్తీ బృందంపై దాడి
20 మంది భారత్‌ సైనికులు వీరమరణం
43 మంది చైనా సైనికులూ హతం?
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత్‌ ప్రభుత్వం
సరిహద్దుల్లో బలగాలను పెంచాలని భారత్‌ నిర్ణయం
త్రివిధ దళాల అధిపతులతో రక్షణశాఖ మంత్రి ఇప్పటికే రెండుసార్లు భేటీ
వాస్తవ పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన రాజ్‌నాథ్‌సింగ్‌

భారత్‌-చైనా సరిహద్దులో పోరాడి అసువులు బాసిన తెలుగుతేజం సంతోష్‌బాబు
గాల్వన్‌లోయ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ వీరమరణం
నేడు జమ్మూకశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో సంతోష్‌ పార్థీవదేహం
హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా సూర్యాపేటకు తరలించనున్న అధికారులు
ప్రభుత్వ లాంఛనాలతో సంతోష్‌ అంత్యక్రియలు జరిపించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

నేడు రెండోరోజు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
15 మంది సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ :
నేడు శాసనసభ రెండో రోజు సమావేశాలు
శాసనసభలో ఏపీ బడ్జెట్‌పై చర్చ

ఉత్తర బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

>
మరిన్ని వార్తలు