టుడే న్యూస్‌ రౌండప్‌

4 Jun, 2018 18:24 IST|Sakshi

నేను ఎలాంటి తప్పు చేయలేదు
విజయవాడ: తాను ఎలాంటి తప్పు చేయలేదని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఏసీబీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నందుకే తనపై కక్ష గట్టి ఏసీబీ కేసులంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు.

టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్‌
సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ఎల్లుండి స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. 

సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

రజనీ వ్యాఖ్యలు బాధించాయి.. కానీ, ‘కాలా’ను..!
సాక్షి, బెంగళూరు : ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తప్పుబట్టారు.

కేశవ్‌ను సీఎం చేయకపోవడం వల్లే..
లక్నో: వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నిర్లక్ష్యం చేయడం వల్లే ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశామని ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ పేర్కొన్నారు.

మోదీనే మా టార్గెట్‌..
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడమే ప్రధాన అంశం అవుతుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేం‍ద్ర మంత్రి జైరాం రమేష్‌ స్పష్టం చేశారు.

అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు
కోల్‌కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి.

కుమారుడిని హత్య చేసినా.. ఇఫ్తార్‌ విందు
సాక్షి, న్యూఢిల్లీ : కోపాలు, ద్వేషాలు మనుషుల మనస్తత్వాలకు చెందినవని, మంచి చేయమని మాత్రమే మతం చెబుతుందని మరోసారి రుజువైంది. 

బిగ్‌బాస్‌.. నేనెవర్నీ ఫాలో కాను : నాని
బిగ్‌బాస్‌ షోను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఎంతో రసవత్తరంగా నడిపించారు. 

అందుకు సెహ్వాగే కారణం: కేఎల్‌ రాహుల్‌
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో ఆరు మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్నట్లు కనిపించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  సెకండాఫ్‌లో వరుస వైఫల్యాలతో చతికిలబడింది.

రూపాయి 97 పైసలకే 1జీబీ డేటా
రిలయన్స్‌ జియో నుంచి వస్తున్న గట్టి పోటీకి, ఎయిర్‌టెల్‌ ఎప్పడికప్పుడూ తన ప్లాన్లను అప్‌డేట్‌ చేస్తూనే ఉంది. 

మరిన్ని వార్తలు