ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ

5 Sep, 2018 12:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్‌ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు.

ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్‌ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్‌ చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సేద్యానికి నోట్ల సెగ..

అండమాన్‌లో అమెరికన్‌ టూరిస్ట్‌ హత్య

టెకీకి చుక్కలు చూపించిన మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌

ఆ వర్సిటీ తాలిబన్‌కు వత్తాసు..

జైలులో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిట్‌ అధికారుల ఎదుట హాజరైన అక్షయ్‌

మరో సినీ వారసుడు పరిచయం..

అడవుల్లో చిక్కుకున్న అమలాపాల్‌

విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?

2.0 @ 2:28:52

రిసెప్షన్‌ కోసం బెంగళూరు చేరుకున్న దీప్‌వీర్‌