‘అగస్టా’లో కీలక మలుపు

9 May, 2016 03:00 IST|Sakshi
‘అగస్టా’లో కీలక మలుపు

మధ్యవర్తి మిచెల్ కారు డ్రైవర్ విచారణలో వివరాల వెల్లడి
 
 న్యూఢిల్లీ:
అగస్టా హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణబహదూర్‌ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది.  లావాదేవీలను  విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్‌నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి.  

  సహకారానికి ప్రతిఫలం
 ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు(గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు. అయితే.. వాజ్‌పేయి హయాంలో 2003లోనే అగస్టా ఒప్పందం కుదిరిందని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కేసు విషయాన్ని కేవీ థామస్ నేతృత్వంలోని ప్రజాపద్దుల కమిటీ విచారించనుంది.

మరిన్ని వార్తలు