కొత్తగా 5 స్మార్ట్‌ నగరాలు..

1 Feb, 2020 12:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈ ఏడాది కొత్తగా 5 స్మార్ట్‌ నగరాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టెక్స్‌టైల్‌ రంగానికి మరింత ప్రోత్సహం అందిస్తామని చెప్పారు. మొబైల్‌ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సహం అందజేస్తామన్నారు. నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ.1480 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 

(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అలాగే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కొత్త పథకానికి తీసుకురానున్నట్టు చెప్పారు. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్దికి తోడ్పాటు అందిస్తామన్నారు. ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు​ చేయనున్నట్టు వెల్లడించారు. మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం తీసుకోస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్‌)

మరిన్ని వార్తలు