డిపాజిట్‌ దారులకు గుడ్‌ న్యూస్‌

1 Feb, 2020 13:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్‌ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్‌లో రూ.3,50లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్‌ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్‌ రంగంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.

వేధింపులను కేంద్రం ఉపేక్షించదు
స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్‌’  తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్‌ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్‌ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్‌ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు.

చదవండి :

విద్యారంగానికి భారీ కేటాయింపు

డీబీఐ, ఎల్‌ఐసీలో వాటా అమ్మకం

కొత్తగా 5 స్మార్ట్‌ నగరాలు..​​​​​​​

మరిన్ని వార్తలు