ఆ రెండు మాత్రమే అధికారికమైనవి

13 May, 2020 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గిల్గిట్‌ బాల్టిస్తాన్‌, లడక్‌‌ కేంద్రపాలిత ప్రాంతాలపై వస్తున్న తప్పడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. గిల్గిట్‌ బాల్టిస్తాన్‌, లడక్‌లపై సోషల్‌ మీడియాలో ఇటీవల షేర్‌ చేసిన సమాచారం ప్రామాణికమైనది కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. దీనిపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. గిల్గిట్‌-బాల్లిస్తాన్‌పై ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన ట్విటర్‌ ఖాతా ధ్రువీకరించబడినది కాదు. 31,000 మంది ఫాలోవర్స్‌ ఉన్న ఈ ఖాతా గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక ట్విటర్‌ ఖాతా కాదు’ అని ట్వీట్‌ చేసింది. కేంద్ర భూభాగానికి చేందిన లడఖ్ అధికారిక‌ ట్విటర్‌ ఖాతాలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అవి @DIPR_Leh, @InformationDep4లు అధికారికమైనవని వెల్లడించారు. (భారత్‌పై పాకిస్తాన్‌ తీవ్ర విమర్శలు)

ఇక 31వేల మంది ఫాలోవర్స్‌ ఉన్న ఖాతా నకిలీదని.. అది షేర్‌ చేసిన సమాచారం ప్రామాణికమైనదిగా పరిగణించలేమని చెప్పింది. కాగా లడక్‌ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికారిక సమాచారం కోసం దయచేసి @DIPR_Leh & @ InformationDep4 ఖాతాలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్‌,‌ లడక్‌, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని గాని, ముఖ్యమైన ప్రకటనలను వీటి ద్వారానే అధికారులు ప్రకటించడం లేదా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడిచింది. కాబట్టి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై, వాటికి సంబంధించి వస్తున్న సమాచారాలు, ప్రకటనలపై దేశ ప్రజలంతా జాగ్రత్త వహించాలని ట్వీట్‌లో పేర్కొంది. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్‌లు అక్కడినుంచే..!

అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో 

మరిన్ని వార్తలు