వాళ్ల ముందు నగ్నంగా ఉండండి.. కానీ!

25 Mar, 2018 15:31 IST|Sakshi
కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌

కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బికినీలు వేసుకుని తిరిగితే సహించేది లేదంటూ ఇటీవల విదేశీ పర్యాటకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. విదేశీయుల (తెల్లజాతీయుల) ముందు నగ్నంగా ఉండేటంలో ఏ సమస్యలేదు, కానీ మన చుట్టూ ఉన్న అధికారులు, ప్రభుత్వం మన వివరాలు సేకరిస్తే మీకు అనుమానాలెందుకని ప్రశ్నించారు. ఓ కార్యకర్త ఆధార్ డేటాపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈ విధంగా స్పందించారు. కేంబ్రిడ్జ్ అనలైటికాతో, ఆధార్‌కార్డులతో డాటా దుర్వినియోగం అవుతుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆధార్ డేటా దుర్వనియోగం ఆరోపణలపై మంత్రి అల్ఫోన్స్ మీడియాతో మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్తే తనిఖీలలో భాగంగా అక్కడి అధికారుల ముందు నగ్నంగా ఉండేందుకు ఏ మాత్రం ఇబ్బంది లేదు, కానీ స్వదేశంలో అధికారులు వేలిముద్రలు, వివరాలు అడిగితే మాత్రం మీకు అభ్యంతరాలు వస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. తాను అమెరికా వీసా కోసం 10 పేజీల దరఖాస్తు ఫామ్‌ను నింపానని, వేలిముద్రలు, ఇతర వివరాలు కూడా అధికారులకు ఇచ్చానని చెప్పారు.   

‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్‌ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్‌ కోర్స్‌.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోమంటూ’ వ్యాఖ్యలు చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు సూచించి గతంలో కేజే ఆల్ఫోన్స్‌ విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు