సీఎం కారు డ్రైవర్‌కు జరిమానా

1 Apr, 2017 16:30 IST|Sakshi
సీఎం కారు డ్రైవర్‌కు జరిమానా

లక్నో: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా జరిమానా కట్టాల్సింది. అది స్వయానా ముఖ్యమంత్రి డ్రైవర్‌ అయినా సరే. విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారు డ్రైవర్‌ రూ.500 జరిమానా చెల్లించాడు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో అతడు పాన్‌ మసాలా నమలడంతో అతడు ఈ ఫైన్‌ కట్టాడు.

కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్‌ మసాల, గుట్కా నమలడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్‌ పాన్‌ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కారు డ్రైవరే పాన్‌ మసాలా నములుతూ దొరికిపోయాడు.

సీఎం పీఠం చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ ...అధికారులను పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. యూపీ సచివాలయాన్ని సందర్శించిన ఆయన ఆ గోడలపై పాన్ మరకలు ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా  ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాన్ మసాలా వంటివాటిని నమల వద్దని, ప్లాస్టిక్‌ వాడకాన్ని మానుకోవాలని, రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు