మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి | Sakshi
Sakshi News home page

మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి

Published Sat, Apr 1 2017 4:50 PM

మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి - Sakshi

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారా ఏచూరి ఆరోపించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక సవరణల విషయంలో బీజేపీకి రాజ్యసభలో చుక్కెదురైందన్నారు.
 
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉపకరించే చట్టాన్ని బీజేపీ సవరించాలని చూస్తోందంటూ మోదీ బహిరంగ సభలలో చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని విమర్శించారు. కారణాలకతీతంగా దాడులు చేసే అధికారం ఆదాయపన్ను అధికారులకు కట్టబెట్టాలని బీజేపీ చూస్తోందని, దీనివల్ల దేశంలో బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రుణ మాఫీ చేయలేని మోదీ 11 లక్షల కార్పొరేట్ రుణాలను రద్దు చేశారన్నారు.
 
కాగా, తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చేపట్టిన పాదయాత్ర అనుభవాలను సమీక్ష చేశామన్నారు. సామాజిక న్యాయం అనేది ప్రాథమిక అంశంగా గుర్తించామని, ఆ న్యాయ స్థాపన కోసం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించామని సీతారాం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. తమ మహాజన పాదయాత్రని ఇదేవిధంగా కొనసాగించాలని కేంద్ర కమిటీ స్వాగతించిందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
 
సామాజిక న్యాయంలో తెలంగాణ అభివృద్ది జరిగేందుకు వచ్చే సంవత్సరం అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని, మాటలు చెప్పి టైం గడిపేందుకే వచ్చే ఏడాది అని చెబుతున్నారని విమర్శించారు. మధుకర్ అనే దళిత యువకుడు హత్యను దాచిపెడుతున్నారంటూ.. ఆత్మహత్య అయితే ఆవిధంగా ప్రభుత్వం విచారణ జరిపించాలి.. పోస్టుమార్టం చేయించాలి అని కోరారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం.. ఆ తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement