ఏడాది తర్వాత ఆ అద్భుతాన్ని చూశా

9 May, 2020 09:31 IST|Sakshi

భువనేశ్వర్‌ : మనం రోజు చూసే ప్రకృతిలో కొన్ని దృశ్యాలు మనం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతులు మిగిలిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాగర తీరాన ఒకేసారి వేళ తాబేళ్లు సముద్రంలోకి పరిగెడుతున్నఅద్భుతాన్ని ఎప్పుడు చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి. ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ప్రతీ ఏడాది సముద్రం అడుగుబాగం నుంచి ఒడ్డుకు వస్తాయి. గుడ్లను పెట్టడంతో పాటు పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారుచేస్తుంటాయి. ఈ ప్రక్రియను అరిబాడా అనే పేరుతో పిలుస్తారు. తమ పిల్లలు కొంచెం ఎదిగాక ఒకేసారి అన్నీ కలిసి యధావిధిగా సముద్ర అడుగుబాగంలోకి చేరుకుంటాయి. అలాంటి వీడియోనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుషాంత నంద  తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ' ఏడాది తర్వాత మళ్లీ ఆ అద్భుతాన్ని చూశాను. ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో గుడ్ల పెట్టడానికి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చే దృశ్యం ఎంతో బాగుంటుంది.  దాదాపు 2 కోట్ల ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు 4 లక్షల ఇసుక గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి . తమ పిల్లలను తీసుకొని ఒకేసారి సముద్రంలోకి వెళ్లే దృశ్యం మాత్రం చూపరులను ఆకట్టుకుంటుంది.ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తున్నా..' అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు