'దిగ్విజయ్ , షిండేల విరుద్ధ ప్రకటనల వెనుక ఉద్దేశ్యమేమిటి?

11 Oct, 2013 16:05 IST|Sakshi

హైదరాబాద్: విభజన అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఓ ప్రకటన చేస్తే..కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో ప్రకటన చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదని ఏపీ ఎన్జీవోలు ప్రశ్నించారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి రాజ్యాంగ పరమైన అహగాహన ఏమీ లేనట్లుందని ఎద్దేవా చేశారు. ఈ రకంగా ముందుకెళితే కాంగ్రెస్ కు సీమాంధ్రలో రాజకీయ భవిష్యత్ ఉండదని ఏపీఎన్జీవోలు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఎంవో విధానం లోప భూయిష్టంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
 

విభజనను అడ్డుకుంటామంటున్న సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి..  సమైక్యాంధ్ర కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. . విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీఎన్జీవోలు ఎమ్మెల్యేలకు లేఖలు విడుదల చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కేంద్ర కార్యాలయాల ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కలిసి సమైక్య నినాదం వినిపించాలని కోరతామన్నారు

మరిన్ని వార్తలు