ఆర్టీసీ డీఎం నిలదీత 

3 Mar, 2019 16:11 IST|Sakshi
ఆర్టీసీ డీఎంను నిలదీస్తున్న గ్రామస్తులు

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని లింగంపేట గ్రామస్తులు శనివారం డీఎం ఆంజనేయులును గ్రామస్తులు నిలదీశారు. శనివారం ఆయన బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 6 నెలలలుగా బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదని విద్యార్థులు, ప్రయాణికులు డీఎంను నిలదీశారు.

తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్‌ దీపాలు, కూర్చోవడానికి బల్లలు, బస్టాండ్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చాలని పలుమార్చు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌ నుంచి ప్రతి సంవత్సరం దుకాణ సముదాయాలు, హోటళ్ల నుంచి ఆదాయం వస్తున్నా ఎలాంటి పనులు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.

బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిన గ్రామస్తులపై డీఎం మండిపడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించే హక్కు మీకు లేదని గ్రామస్తులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోండని చెప్పడంతో డీఎంపై నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం సర్పంచ్‌ లావణ్య రూ. 40వేలు ఖర్చు చేసి బస్టాండ్‌ను చదును చేయించారు.

బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించడంతో ఆర్టీసీ అధికారులు విఫలమైనట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు డీఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు