జగన్‌పై దాడిని ఖండించిన చికాగో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌

31 Oct, 2018 14:48 IST|Sakshi

చికాగో : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని చికాగో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ సభ్యులు ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జరిగిన సంఘటనని ఖండించక పోగా తక్కువ చేసి చూపుతున్నారని వెకిలి చేష్టలతో కామెడీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమని నమ్మించడానికి ఈ హత్యాప్రయత్నం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరిగిందని ఎన్‌ఆర్‌ఐలు ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ గరుడలో భాగమని శివాజీ ముందే చెబితే, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శివాజీ ని అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 


ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించాలనే పథక రచన ప్రభుత్వం చేసిందన్నారు. దాడి చేసిన వ్యక్తి దగ్గర దొరికిన 10 పేజీలు అతను రాసింది కాదని, ప్రభుత్వమే పోలీసుల చేత రాయించారని విమర్శించారు. ఆ పేజీలను జేబులో ఉంచుకుంటే కనీసం నలిగిపోయినట్టుగా కనిపించాలని, కానీ అవి నలిగిపోయినట్టుగా కనిపించడం లేదు కాబట్టి దానిని ఎవరో రాసినట్టుగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోకి దుండగుడు కత్తితో ఎలా ప్రవేశించాడని, తీవ్రవాదులు బాంబులతో ప్రవేశిస్తే రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్ర ప్రభుత్వంగానీ ఇక ఏం చేయగలరని ఎన్‌ఆర్‌ఐలు ప్రభుత్వాలని ప్రశ్నించారు.
 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించడం వల్లనే తనను చంపేయాలని అనుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు రకాలుగా కుట్ర పన్ని వైఎస్‌ జగన్‌ని అంతమొందించాలనుకున్నారని కానీ వారి పథకాలు పారలేదని విమర్శించారు. హత్య చేసి అల్లర్లు సృష్టించాలని లేదా స్లో పాయిసన్ ఇచ్చి నిర్మూలించి అభిమాని చేతిలో చనిపోయాడని చిత్రీకరించాలనుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వాడిన భాష నాగరికంగా లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందుతుందని చికాగో ఎన్‌ఆర్‌ఐలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, పోలీసు అధికారులు తెలుగుదేశం కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా పనిచేయడం మానుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాప్రయత్నం కేసుని నీరు గార్చకుండా నిజాయితీగా విచారణ జరిపి, బాధ్యుని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు.

ఈ నిరసనలో చికాగో వైఎస్సార్‌సీపీ రీజనల్ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రాంభూపాల్ కందుల, శ్రీనాధ రెడ్డి అంకిరెడ్డి పల్లె, శరత్ యట్టెపు, పరమేశ్వర్ యర్రసాని, రవి కిషోర్ ఆళ్ళ, రామిరెడ్డి పెద్దిరెడ్డి, ప్రమోద్ ముత్యాల, మనోజ్ సింగం శెట్టి, హారీందర్ పుల్వాయి, సంజీవ్ కాప, జానకీ రాం, రమాకాంత్ జొన్నల, వెంకట్, మోహన్ గారి కృష్ణా రెడ్డి, వెంకట్ తూడి, మహిపాల్ వంచా, సుమన్ శనివారపు, గోపి పిట్టల, శ్రీనివాస్ సరికొండ, లింగారెడ్డి, సందీప్, రవి కిషోర్, భీమా రెడ్డి, శ్రీధర్, రమణారెడ్డి, మోహన్ పిట్టల, రామలింగం కొండూరు, మల్లారెడ్డి, తేజేశ్వర్, సుధాకర్, రమణ అబ్బరాజు, నరసింహా రెడ్ది, శివ, మనోహర్, రామ్ దొనపాటి, సురేన్ మొరుకువాటి, వెంకట సుబ్బారెడ్డి, ధీరజ్, సురేందర్ రెడ్డి, వెంకట్ కొండూరు, బక్త ప్రియా, వెంకట్ యర్రా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు