హెచ్‌టీటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు

25 Oct, 2019 20:09 IST|Sakshi

ఫ్లోరిడా : నార్త్‌ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని తల్లహాసీలో హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీ(హెచ్‌టిటి) ఆధ్వర్యంలో అక్టోబర్‌12న దసరా, దీపావళి సంయుక్త వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు 800 మందికి పైగా హాజరయ్యారు. 80 మంది ఫుడ్ వాలంటీర్లు,  12 లైవ్ ఫుడ్ స్టాల్సు లో 54 రకాల వంటకాల తో పసందైన విందు, పిల్లలకు గేమ్‌ స్టాల్స్‌తో పాటు వినోద కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన 22 అడుగుల రావణుని బొమ్మకు దహణ కార్యక్రమం నిర్వహించి జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సాయి శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ .. తల్లహసీ అంటే సెవెన్ హిల్స్‌ (సప్తగిరి) అని పిలుస్తారు. ఇక్కడ స్తిరపడిన ప్రవాస భారతీయులు తల్లహసీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  ప్రతీ ఏటా దసరా రామలీల పేరుతో రైసింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. 22 అడుగుల ఎత్తులో రావణుడి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేసి సంబరాలు జరుపుకుంటారు. ఆలయ నిర్మాణ ట్రస్టు బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి నందినేని మాట్లాడుతూ సప్తగిరిగా పిలువ బడుతున్న ఈ ప్రాంతంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వేడకల్లో పాల్గొన్న ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించవ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంత భాగా జరగడానికి కృషి చేసిన వలంటీర్లకు, ఇతర స్పాన్సర్లకు సాయి శశిధర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు