అక్టోబర్ 12, 13న సింగపూర్‌లో తిరుమల శ్రీవారి కల్యాణం

30 Sep, 2019 15:00 IST|Sakshi

సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో అక్టోబర్ 12,13న అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణమహోత్సవం నిర్వహించేందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణోత్సవానికి శ్రీవారు, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల నుండి సింగపూర్‌వాసులను కరుణించడానికి రానున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్ధానాలకు చెందిన అర్చకులు, వేదపండితులు తిరుమల క్షేత్రం నుంచి వచ్చి సింగపూర్లో ఆ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని, ఇతర కైంకర్య సేవలను తిరుమలలోలానే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇటువంటి సేవలు సింగపూర్‌లో నివసించే అందరికీ, తిరుమల వెళ్ళలేని వారికి కూడా ఇవి అందుబాటులో ఉండేలా, అందరినీ తరింపచేయాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్ధానాల చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మన్, టీటీడి బోర్డ్ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర దేవస్ధాన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు. గేలాంగ్ ఈస్ట్ అవెన్యూ 2, శ్రీ శివన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఓపెన్ లాన్స్ ఈ మహోత్సవానికి వేదిక కానుంది. దేదీప్యమానంగా జరగనున్న ఈ వేడుకలో భక్తజనం అందరూ పాల్గొని కనులారా తిలకించి, తరించి, తీర్ధప్రసాదాలు, తిరుపతి లడ్డుప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సింగపూర్ తెలుగు సమాజం కోరింది. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా