అక్షరంతోనే 'పునాది'

19 Aug, 2015 01:25 IST|Sakshi
అక్షరంతోనే 'పునాది'

తెలంగాణ స్వరాష్ట్రాన్ని సా ధించుకుని ఏడాది గడిచిపో యింది. అరవయ్యేళ్ల పోరా టంతో సాధించుకున్న స్వరా ష్ట్రంలో ఎక్కడివక్కడ సర్దుకో వడంలోనే ఈ ఏడాది కాలం గడిచిపోయింది. ఇక మనకు నచ్చినట్లుగా మన ఇంటిని తీర్చిదిద్దుకునే పని మొదలె ట్టాల్సి ఉంది. ఇలా తీర్చిదిద్దుకోవడంలో పుస్తకం పాత్ర కీలకం. తెలంగాణ పాటకు, ఆటకు, పోరాటానికి అక్షర రూపం ఇచ్చి తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో అక్షరం పోషించిన పాత్ర అనిర్వచనీయం. కవులు కవిత్వంతో, ఉద్యమకారులు రచనలతో ప్రజ లకు అక్షరాయుధాలను అందించారు. తెలంగాణ పున ర్నిర్మాణంలోనూ ఇలాంటి మహత్తర పాత్రను అక్షరం పోషించాలి.

 తెలంగాణ సాయుధ పోరాటం, ఆంధ్ర మహాస భలు, గోలకొండ పత్రిక.. ఇలా ఎన్నెన్నో  మైలురాళ్ల తర్వాత అంతిమంగా స్వరాష్ట్రం వచ్చింది. దీన్ని అభి వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదు. ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ఈ పని చేయలేదు. ప్రభు త్వం తాను చేయగలిగిన పనులు తాను చేస్తూంటే, మరోవైపున తెలంగాణ సమాజం తాను చేయగలిగిన పనులు తాను చేయాలి. తెలంగాణ పోరాట సమయం లో సొంత జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టినట్లే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ కనీసం ఓ పదేళ్లపాటు ఇలాంటి ప్రయత్నాలు జరగాలి.

 కానీ వలసపాలనలోని విద్యావిధానం దుష్ఫలితా ల కారణంగా తెలంగాణలో ప్రస్తుతం తల్లి కడుపులో ఉన్నప్పుడే అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. గుర్రాన్ని గంతలు కట్టి నడిపినట్లు పిల్లలను చిన్నప్ప టినుంచే ఎంట్రన్స్‌ల బాటలో నడిపిస్తున్నారు. చదు వంతా నిత్యం పరీక్షల చుట్టే తిరుగుతోంది. ఫ్యాక్టరీలు గా మారిన విద్యాసంస్థల్లో విషయం అర్థం చేయించ కుండా బట్టీ పెట్టిస్తున్నారు. పిల్లలకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పల్లీలు ఎక్కడ కాస్తాయో తెలీదు. చెట్లెక్కడం రాదు. పల్లె తెలియదు. మట్టివాసన తెలియదు. ఈ పరిస్థితి మారాలి. ముఖ్యంగా బట్టీ చదువులను వదిలించుకోవాలి.బట్టీ పట్టి పరీక్షలు పాస్ అయినవారు సమాజాన్ని మార్చలేరు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న వారిని అందించేందుకు మనం కృషి చేయాలి. ప్రధానంగా తెలంగాణ భావజాలాన్ని సర్వవ్యాప్తం చేయాలి.

 తెలంగాణ భావజాలం: తెలంగాణ భావజాలం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది యావత్ తెలంగాణ ప్రజానీ కం సొత్తు. ఈ నేలపై పుట్టిన ప్రతీఒక్క పార్టీ, ప్రతీ ఒక్క ప్రజాసంఘం, ప్రతీ ఒక్క సామాజిక సంఘం తెలంగా ణ భావజాలాన్ని ఉపయోగించుకునే వీలుంది. ఈ క్రమంలో వాటికి తోడుండేది అక్షరమే. ఆ అక్షరా లను తెలంగాణ నుడికారంతో, మమకారంతో మేళవిం చడమే మనమిప్పుడు చేయాల్సిన పని. తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఆయా రంగాల్లో కంటికి కనిపించే అభి వృద్ధి మాత్రమే కాదు. అంతకు మించిన స్థాయిలో కం టికి కనిపించకుండా ఉండే భావజాల వ్యాప్తి కూడా. తెలంగాణలో జరిగే ప్రతిపనిలో ఇది కానరావాలి. పాఠ్య పుస్తకాలు, పాఠ్యేతర పుస్తకాల విషయంలోనూ తెలం గాణ ఆత్మ దర్శనమివ్వాలి. పుస్తకం తెరిస్తే తెలంగాణ ఆత్మ సంభాషిస్తున్నట్లు ఉండాలి. అక్షరాలను తెలంగాణ భావజాలం ఆవహించడం అంటే మితిమీరిన జాతీయ వాద ప్రచారం కాదు. ఇప్పటివరకు పరాయీకరణ చెం దిన వివిధ అంశాలను తెలంగాణ మయం చేయడమే.

 పరాయీకరణం: అరవై ఏళ్ల పరాయి పాలనలో మన భాష పరాయీకరణ చెందింది. మన రాజకీయం, సంస్కృతి సమస్తమూ పరాయీకరణకు గురయ్యాయి. ఇప్పటికీ ఇది తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు కృషి చేస్తూనే ఉంది. ఈ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే బహు ముఖ దాడి తప్పదు. అది అక్షరాలతోనే సాధ్యం. పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే కేజీ నుంచి పీజీ దాకా ఈ 60 ఏళ్ల పరాయిపాలనలో కొనసాగిందంతా రెండున్నర జిల్లాల భాషనే. దాన్ని పదిజిల్లాల తెలంగాణ భాషగా మార్పు చేసుకోవాల్సిన అవసరముంది. పరాయి పాల కులు మన చరిత్రను వెలుగులోకి రానీయకపోవడమే కాకుండా మనం మాట్లాడుకునే భాషను కూడా యాస గా మాత్రమే పరిమితం చేశారు. దాన్ని ఇప్పుడు ఒక సంపూర్ణ సర్వస్వతంత్ర భాషగా తీర్చిదిద్దుకోవాలి.

 తెగిన పేగుబంధం: తెలంగాణలో ఒక మూడుత రాల చరిత్రను చూస్తే తాత తెలంగాణ భాష మాట్లాడే వాడు. ఇతరులు తెలంగాణ భాషలో మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. తండ్రి కాలానికి వస్తే తాను స్వయం గా తెలంగాణ భాష మాట్లాడలేనప్పటికీ, ఇతరులు మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. మనవడి కాలానికి వస్తే తాను తెలంగాణ భాష మాట్లాడలేడు. అర్థం చేసు కోలేడు. మూడు తరాల చరిత్రలో తెలంగాణలో ఇలాం టి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. పురిటి గడ్డతో పేగుబంధం తెగిపోతోంది. సొంతతల్లిపై మమ కారం లేని వారు అన్నింటా విలువలకు తిలోదకాలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనుకుంటే, మనబిడ్డలను ఈ నేలతల్లి బిడ్డలుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. అందుకు పాఠ్యపుస్తకాలు వేదికలు కావాలి. భాష, సామాన్యశాస్త్రం సాంఘికశాస్త్రం, గణి తం ఇలా బోధించే అంశం ఏైదైనా సరే అందులో తెలంగాణతనం ఉట్టిపడాలి. ఆంగ్ల, తెలుగు మాధ్య మాలు రెండింట్లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి లాంటి వాటి గురించి వివరించాలి. ఇదంతా కూడా తెలంగాణ ఆత్మ తనను తాను పునర్నిర్మించుకోవడమే.

 పుస్తకాలకు పట్టం: ఈ సుదీర్ఘ ప్రక్రియ విజయవం తం కావాలంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే కాకుండా ఇంకా చదువదగ్గ పుస్తకాలను అనుబంధంగా జాబితా రూపంలో ఇచ్చి వాటిని విద్యార్థుల చేత చదివించాలి. స్కూల్లో ప్రస్తుతం పుస్తకం చదవలేని పరిస్థితులున్నా యి. పుస్తక ప్రదర్శనలు ప్రోత్సహించాలి. వాటిలో మన పుస్తకాలకు పట్టం కట్టాలి. మన భాషలో రచనలు రావా లి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటకం వంటి అం శాలపై పాపులర్ రచనలను పెద్ద ఎత్తున తీసుకురా వాలి.

తెలంగాణ పునర్నిర్మాణం లక్ష్యంగా ఒక మహో జ్వల రచన, పఠన ఉద్యమాన్ని నిర్మించాలి. పుస్తకాలు చదివే అలవాటుకు బాల్యంలోనే బీజం వేయకుంటే ఎన్నిరకాలుగా కృషి చేసినా ఫలితం రాదు. తెలంగాణ తెచ్చుకున్నాం. దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ముందుతరం వాళ్లకు ఈ పుస్తక పఠనం ద్వారానే తెలి యజేయగలం. దీన్ని సామాజిక బాధ్యతగా తీసు కోవాలి.

 


(వ్యాసకర్త: ఎం వేదకుమార్ చైర్మన్, తెలంగాణ రిసోర్స్ సెంటర్)
 మొబైల్: 9848044713

మరిన్ని వార్తలు