ఉస్మానియా నుంచి నిమ్స్‌కు వైఎస్ జగన్

31 Aug, 2013 06:34 IST|Sakshi

రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, నిరంకుశ వైఖరితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 25 నుంచీ చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఐదు రోజుల పాటు ఏ రకంగా నిరాహార దీక్ష కొనసాగించారో, ఆరో రోజు శుక్రవారం కూడా ఉస్మానియా ఆస్పత్రిలో అదే మాదిరిగా ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం ఆయన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ సూచన మేరకు జగన్‌ను శుక్రవారం అర్ధరాత్రి 11.45 సమయంలో ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం జరిగింది. మొదటిసారి జరిగిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ప్రతిఘటించారు.

మరిన్ని వార్తలు