కొండను తవ్వి ఎలుకను పట్టి, ఇప్పుడు మళ్లీ..

21 Nov, 2019 16:11 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై  ఏఐఎంఐఎం చీఫ్‌, ఎపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీ పేరుతో అస్సాంలో హడావుడి చేసిన మోదీ ప్రభుత్వం... చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పనిని దేశవాప్తంగా చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. ‘ఎన్ఆర్సీ కారణంగా అస్సాం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటీకి కేంద్రం సాధించిందేమి లేదు. 40లక్షల మంది అక్రమంగా చొరబడ్డారని చెప్పిన అమిత్‌ షా.. చివరకు 19లక్షల మందిని మాత్రమే ఎన్‌ఆర్‌సీ జాబితా నుంచి తొలగించారు. అదీ కూడా అక్రమంగా తొలగించారు. ఎన్‌ఆర్‌సీలో నమోదు కానీ భారతీయులను అదుపులోకి తీసుకొవాలని కేంద్రం యోచిస్తుంది. మైనార్టీలను దయతో వదివలేయాలని భావిస్తోంది.  ప్రపంచంలోని ఏ దేశ ప్రజలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొనలేదు’  అని ఓవైసీ పేర్కొన్నారు. 

(చదవండి : ఇక దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ)

ఇక అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాశర్మ కూడా ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్‌షాను కోరుతున్నానని తెలిపారు. ‘ అస్సాం ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తోంది. ఎన్‌ఆర్‌సీని తొలగించాల్సింది కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రాష్ట్ర ప్రభుతం, బీజేపీ కోరుతోందని తెలిపారు. 

కాగా, దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవని ఆయన పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా