శభాష్‌ కిషన్‌: ఒక్క డీల్‌తో వందల కోట్లు..అంతేనా..!

4 Nov, 2023 15:51 IST|Sakshi

అసోంలోని డిబ్రూఘర్‌కు చెందిన  యువకుడు కిషన్‌ బగారియా  బంపర్‌ ఆఫర్‌ దక్కించుకున్నాడు. కిషన్‌ రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను టెక్ట్స్‌డాట్‌కామ్‌ను  అమెరికా  పాపులర్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఈడీల్‌  విలువ  ఏకంగా రూ.416  కోట్లు. అంతేకాదు వర్డ్‌ ప్రెస్‌డాట్‌కామ్‌, ఆటోమాటిక్ ఇంక్ వ్యవస్థాపకుడు మాట్ ముల్లెన్‌వెగ్ కిషన్ బగారియాపై ‘టెక్‌ జీనియస్‌’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీంతో టెక్నాలజీ రంగంలో భారతీయ యువత ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. 

చారియాలీ ప్రాంతానికి చెందిన మహేంద్ర బగారియా, నమితా బగారియా దంపతలు కుమారుడు కిషన్ బగారియా మెసేజింగ్ యాప్ టెక్ట్స్‌ డాట్‌కామ్‌ను డెవలప్‌ చేశాడు. ఇటీవల అమెరికా వెళ్లిన కిషన్‌ ఆన్‌లైన్ ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ టెక్ట్స్‌డాట్‌కామ్‌ను రూపొందించాడు.   వాట్సాప్, మెసెంజర్‌, లింక్డిన్‌, సిగ్నల్‌, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్‌ తో సహా మీ అన్ని మెసేజింగ్ యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో తీసుకువస్తుందీ యాప్‌. భిన్న వేదికల్లో మెసేజ్ చేసేందుకు ఆల్ ఇన్ వన్ యాప్  ద్వారా మెసేజ్‌ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని వాటి కోసం ప్లాన్‌లు ఉన్నాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌ ద్వారా  ప్రకటించింది. తాజా కొనుగోలుతో కిషన్ బగారియా, తన యాప్‌ బృందంలోని మిగిలిన వారితో పాటు మెసేజింగ్ కొత్త హెడ్‌గా కంపెనీలో చేరనున్నారు. ప్రస్తుతమున్న తమ యాప్‌  యూజర్ల సేవల్లో ఏమీ మార్పు ఉండదు. మరిన్ని ఫీచర్లు, మొబైల్‌ యాప్స్‌ అందుబాటులోకి రానున్నాయి అంటూ ట్విటర్‌లో వెల్లడించాడు కిషన్‌. 

కిషన్‌ బగారియా
ప్రాథమిక విద్యను డిబ్రూఘర్‌లోనే పూర్తి చేసిన కిషన్‌ ఎపుడూ కాలేజీకి కూడా వెళ్లలేదట. తన విజ్ఞానం అంతా ఇంటర్నెట్‌నుంచి నేర్చుకున్నదే అంటాడు. అయితే  అధునిక టెక్నాలజీలో మరిన్ని వెళకువలు నేర్చుకునేందుకు  గత ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాడు. పన్నెండేళ్ల వయసులో  స్మాల్‌ విండోస్‌ యాప్‌ తయారీపై దృష్టిపెట్టాడు. కిషన్‌ సోదరుడుకూడా అమెరికాలో యాప్‌ తయారీలో బిజీగా ఉన్నాడట. దీంతో బగారియా బ్రదర్స్‌ యాప్‌ ప్రపంచాన్ని రాక్‌  చేయనున్నారంటూ సన్నిహితులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు