చంద్రబాబు..దేవన్ష్‌పై ప్రమాణం చేస్తావా?: ఆమంచి

7 Apr, 2019 11:37 IST|Sakshi

సాక్షి, చీరాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్‌ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు. నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతున్నా. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తా అని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్. ప్రజలకు ఏమి అవసరమో ...ఆయనకు అవగాహన లేదు. 

చంద్రబాబు అతి తక్కువ నిధులు ఇచ్చింది చీరాల నియోజకవర్గానికే. ప్రజలు కట్టే పన్నులతో మేము అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మహిళలపై గౌరవం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ మహిళలో అక్రమ సంబంధం అంటగట్టమని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది వాస్తవం కాదా?. దీనిపై నార్కో ఎనాలసిస్‌ పరీక్షకు సిద్ధమా?. లేకుంటే నీ మనవడు దేవన్ష్‌పై ప్రమాణం చేసి చెబుతావా?’ అని సవాల్‌ విసిరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు