పోలవరం ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి..

22 Aug, 2019 18:08 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : పోలవరం ప్రాజెక్ట్‌ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్ రద్దుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంపై ఆయన గురువారమిక‍్కడ మీడియాతో మాట్లాడుతూ.. పనుల విషయంలో యధావిథిగా రివర్స్‌ టెండిరింగ్‌కు వెళ్లవచ్చని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతి బయటకు వస్తాయని చంద్రబాబకు భయం పట్టుకుందని అన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామని...ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక వరదల్లో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వరదలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని, వరదల్లో  ఒక్క గండి పడలేదని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామని అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోలవరంపై మొదటి నుంచి తమ విధానం ఒకటేనని,  అవినీతిని వెలికి తీసి ప్రజా ధనాన్ని కాడటమే అని అన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి


మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి కాలిబాట ద్వారా తిరుమల చేరుకున్న ఆయన వెంకన్నను దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రిగా బాధ్యలు స్వీకరించిన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చినట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు  చేపట్టినప్పటి నుండి వర్షాలు సంవృద్ధిగా కురిసి జలాశయాలు అన్ని నిండుతున్నాయన్నారు.  


మరిన్ని వార్తలు