కాంగ్రెస్ పటిష్టతకు పునరంకితం కావాలి

30 Dec, 2017 12:52 IST|Sakshi

రాహుల్ నాయకత్వంలో నూతన శకం

వైరా మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుల సమావేశంలో భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా, వైరా :ఖమ్మం జిల్లా లోని వైరా నియజకవర్గ కాంగ్రెస్ పార్టీని మరింతగా పటిష్ట పర్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు , మధిర శాసనసభ్యుడు భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు.

శనివారం వైరాలో నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడు ఐతం సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయాలన్నారు. ఈ క్రమంలో పార్టీ కమిటీ తో పాటుగా అనుబంధ సంఘాలను గ్రామ స్థాయి వరకు పటిష్ట పరచాలని చెప్పారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నవ శకానికి నాంది పలుకుతుందన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నిర్మాణాత్మకమైన కృషిని అందించాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశయాలు. ఆకాంక్షకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న టీఆరెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సమాయత్తం అయ్యారని చెప్పారు. ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా పని చేసే ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తొలుత పార్టీ మండల అధ్యక్షులు నిర్వహిస్తున్న కార్యకలాపాలను సమీకించారు. ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యే విధంగా చేపట్టాల్సిన కార్యకలాపాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయా మండల అధ్యక్షులు తమ తమ అనుభవాలను సమావేశంలో పంచుకున్నారు. సమావేశంలో ఖమ్మం డిసిసి ఎస్టీ సెల్ చైర్మన్ ఎల్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు