స్తంభించిన ప్రజా రవాణా

10 Jan, 2019 03:58 IST|Sakshi

రైళ్లు, బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులు

ముగిసిన భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ప్రకటించిన రెండ్రోజుల భారత్‌ బంద్‌ బుధవారంతో ముగిసింది. బంద్‌ సందర్భంగా కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను అడ్డుకోగా, బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రవాణా, విద్యుత్‌ సరఫరా, మైనింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. బెంగాల్‌ లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై రాళ్లవర్షం కురిపించారు.

కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై దాడిచేశారు. తిరువనంతపురం–హైదరాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్, వేనాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆందోళనకారులు తిరువనంతపురంలో అడ్డుకున్నారు. బంద్‌ నేపథ్యంలో కేరళలో వాణిజ్య సముదాయాలు, షాపులు రెండో రోజూ మూతపడ్డాయి. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోగా, తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

ఆగిపోయిన 20 వేల కోట్ల లావాదేవీలు
గోవాలో ప్రైవేటు బస్సులు, ట్యాక్సీల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబైలో అక్కడి రోడ్డు రవాణా సంస్థ ‘బెస్ట్‌’ జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో నిరవధిక బంద్‌కు దిగడంతో లక్షలాది మంది ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాశారు. అలాగే బెంగళూరులో రద్దీగా ఉండే మేజిస్టిక్‌ బస్టాండ్‌లోనూ వామపక్ష ట్రేడ్‌ యూనియన్లు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నాయి. ఈ బంద్‌ లో ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసో సియేషన్‌ (ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ) పాలొ ్గనడంతో రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే ప్రభు త్వ రంగ ఎస్బీఐతో పాటు ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
 

మరిన్ని వార్తలు