కేబినెట్‌ భేటీ.. కశ్మీర్‌పై చర్చ

5 Aug, 2019 09:46 IST|Sakshi

ప్రధాని నివాసంలో కేబినెట్‌ సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ కల్లోలంపై చర్చించేందుకు కేంద్రమంత్రి మండలి సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి మంత్రివర్గ సభ్యులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కశ్మీర్‌పై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశమయిన ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రిమండలి భేటీ కంటే ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమావేశమై దీనిపై చర్చించారు.

కశ్మీర్‌పై ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తే.. న్యాయపరమయిన సమస్యలు తలెత్తవన్న అంశాలపై వీరిద్దరు చర్చంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తగా కశ్మీర్‌ను బలగాలతో చుట్టిముట్టిన కేంద్రం లోయను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. అలాగే కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఎలాంటి నిరసనలు, ధర్నాలు చేపట్టకుండా కీలక నేతలనంతా గృహా నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అయితే కేమినెట్‌ నిర్ణయం  ఏవిధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

>
మరిన్ని వార్తలు