Dec 21st: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

21 Dec, 2023 19:10 IST|Sakshi

చంద్రబాబులో కనిపించని మార్పు

తానే అంతా చేశానని చెప్పుకోడానికి బాబు పాట్లు

యువగళం పేరుతో విష ప్రచారం చేయడానికి ప్రయత్నం

ఎన్నికలకు మూడు నెలల ముందుగానే వేడేక్కిన రాజకీయం

AP Elections Political Latest Updates Telugu

6.05 PM, గురువారం, Dec 21, 2023
పవన్‌ నియోజకవర్గంపై కన్‌ఫ్యూజన్‌

  • మళ్లీ రెండు నియోజకవర్గాలు కావాలంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పవన్‌ కళ్యాణ్‌
  • గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పవన్‌
  • గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • ఈ సారి మళ్లీ గాజువాకలో పోటీ చేస్తానంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచిందని గుర్తు చేస్తోన్న పవన్‌
  • ఈ సారి కలిసి పోటీ చేస్తాం కాబట్టి తనకు గాజువాకలో అవకాశం ఉంటుందంటున్న పవన్‌
  • ఇదే విషయాన్ని రివర్స్‌లో  చెబుతోన్న తెలుగుదేశం నాయకులు
  • తమకు బలమున్న చోట పవన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వడమంటోన్న టిడిపి సీనియర్లు
  • తనకు మాటిచ్చారు కాబట్టి గాజువాక ఇవ్వాల్సిందేనంటోన్న పవన్‌
  • పవన్‌కు అదే హామీ ఇచ్చి లోకేష్‌ సభకు రప్పించానని సీనియర్లకు నచ్చజెబుతోన్న చంద్రబాబు
  • గాజువాకలో మరోసారి ఓటమి తప్పదంటున్న టిడిపి సీనియర్లు
  • ఈ సారి రెండో నియోజకవర్గంగా పిఠాపురం అయితే బాగుంటుందన్న పవన్‌
  • పిఠాపురంలో 14,992 ఓట్ల మెజార్టీతో గెలిచిన YSRCP అభ్యర్థి దొరబాబు పెండెం
  • పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తనకు అడ్వాంటేజ్‌ అంటోన్న పవన్‌
  • తెలుగుదేశం అభ్యర్థి వర్మకు ఎసరు పెట్టేందుకు జనసేన ఇన్‌ఛార్జ్‌గా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
  • తంగెళ్ల గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తే పవన్‌ పోటీకి అనుకూలంగా ఉంటుందని జనసేన ప్లాన్‌

5.30 PM, గురువారం, Dec 21, 2023
తాడిపత్రిలో తెలుగుదేశం క్షుద్ర రాజకీయాలు : కేతిరెడ్డి పెద్దారెడ్డి

  • తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్
  • తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధం
  • నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది
  • నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా
  • నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
  • టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు
  • తాడిపత్రి అభివృద్ధి కి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు
  • అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి 52 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంటున్నారు
  • సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దే
  • టీడీపీ పాలనలో సాగునీరు అడిగే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదే
  • సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం
  • ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు- తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

5.03 PM, గురువారం, Dec 21, 2023
చంద్రబాబు అనుచరులే విద్యావ్యవస్థను నాశనం చేశారు : ద్వారంపూడి

  • కాకినాడలో మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
  • చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి సిఎం జగన్
  • అమ్మ ఒడి పధకంతో పిల్లల చదువుల భాధ్యత సిఎం జగన్ తీసుకున్నారు.
  • పేద తల్లిదండ్రుల కష్టాన్ని తన గుండెల్లో పెట్టుకున్నారు.
  • కార్పోరేట్ స్కూల్ లో చదివే పిల్లలకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే  విద్యార్ధులు అదృష్ట వంతులు.
  • శ్రీచైతన్య, నారాయణ పాఠశాలలు చంద్రబాబు అనుచరులవి.
  • ఆ పాఠశాలల బాగుండాలని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు లేకుండా చేశాడు చంద్రబాబు
  • పేదలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంది
  • గత టిడిపి ప్రభుత్వం లో పేద విద్యార్ధుల కోసం ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదు.
  • నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలలు అభివృద్ధి చెందాలని చూశాడు.
  • ఎన్నికలు మరో‌ 100 రోజులు ఉన్న నేపధ్యంలో దొంగ హమీలు ఇచ్చేవారిని నమ్మొద్దు

4.43 PM, గురువారం, Dec 21, 2023
ఆ ఘనత డా.YSRదే : అక్బరుద్దిన్‌ ఓవైసీ

  • అసెంబ్లీలో దివంగత సీఎం YSRను పొగిడిన అభివృద్ధిని అక్బరుద్దిన్ ఓవైసీ
  • డాక్టర్‌ YSR మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు
  • డాక్టర్‌ YS రాజశేఖర్ రెడ్డి నిజంగా ఒక గొప్ప జెంటిల్మెన్
  • ఆయనతో మేము కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాం
  • మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ల క్రెడిట్ అంతా డాక్టర్‌ YSRకే దక్కుతుంది.
  • 4 శాతం రిజర్వేషన్ల క్రెడిట్ వైఎస్సార్ తప్ప వేరే వాళ్ళు తీసుకుంటా అంటే ఒప్పుకోం
  • ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు  వైఎస్ఆర్ కలిసి మా ఇంట్లో రిజర్వేషన్లపై చర్చించారు.

4.31 PM, గురువారం, Dec 21, 2023
జనసేన పుట్టింది లోకేష్‌ కోసమా? : మంత్రి అంబటి

  • తుస్సుమన్న తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభ
  • ఆరు లక్షల మంది జనాలొస్తారని ఊదరగొట్టి కంగుతిన్నారు
  • నేతల ప్రసంగాలప్పుడే సగానికి పైగా సభ ఖాళీ చేశారు
  •  ఆరు లక్షల మంది జనాలు వస్తారని ప్రచారం చేసుకున్నారు కదా.!
  • ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..?
  • వచ్చిన వాళ్లు ఎంతసేపు ఉన్నారు..? ఎవరి ఉపన్యాసాలు విన్నారు..?
  • పొత్తు బీజేపీతో.. సంసారం తెలుగుదేశంతోనా..?
  • మీ ఇద్దరి సంబంధానికి.. బీజేపీ పెద్దల బ్లెస్సింగ్సా.. ?
  • మీ ఇద్దరి పొత్తు ఈరోజేం కొత్త కాదుగా..?
  • రాష్ట్రంలో సొంత ఇల్లులేని సన్నాసులు చంద్రబాబు,పవన్,లోకేశ్‌లు
  • జగన్‌ గారి ప్రజాదరణ చూసి భయపడే గుంపుకట్టారు
  • సింగిల్‌గానే మేము 175కి 175 స్థానాల్ని గెలుచుకుంటాం
  • గతంలో 2014 ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీచేశారు
  • చంద్రబాబుతోనే జనసేన పవన్‌కళ్యాణ్‌ అంటకాగాడు
  • ఐదేళ్లు ఇద్దరూ కలిసి అధికారం వెలగబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయగలిగారు..?
  • ప్రజల మదిలో గుర్తుండిపోయే ఒక్క మంచి పనిని మేము చేశామని చెప్పే దమ్ముందా..?
  • దీనికి పవన్‌కళ్యాణ్‌ బాధ్యుడు కాడా..?

4.15 PM, గురువారం, Dec 21, 2023
చెల్లని రుపాయి .. పవన్‌ కళ్యాణ్‌ : డిప్యూటీ సీఎం కొట్టు

  • తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
  • రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి ముందు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాడో చూసుకోమనండి.
  • పదో తరగతి మూడు సార్లు ఫెయిల్ అయ్యానంటాడు, లక్షల పుస్తకాలు చదివాను అంటాడు.
  • నిమిషానికోమాట మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్.
  • ఏ రోజు ఏ మాట మీద నిలబడ్డాడని అతని మాటకు విలువ ఉంది?
  • సీఎం సీఎం అంటే సీఎం అవ్వరు. ఆ విషయం పవన్ కూడా ఒప్పుకున్నాడు.
  • మళ్ళీ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
  • చంద్రబాబుకి ఇంకా దింపుడుకళ్లెం ఆశ తీరక ఏదో పాకులాడుతున్నాడు.
  • దొడ్డిదారి మనస్తత్వం ఉన్న వ్యక్తులు పవన్, చంద్రబాబు.
  • చెల్లని సత్తు రూపాయి లాంటి వారు వీరిద్దరూ.

3.50 PM, గురువారం, Dec 21, 2023
తండ్రీ, కొడుకు, పార్ట్‌నర్‌.. ముగ్గురు ముగ్గురే : కొడాలి నాని

  • యువగళం సభ పై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు
  • కృష్ణా : 2009 నుంచే జగన్ యుద్ధం మొదలు పెట్టారు
  • చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ ను ఓడించి, లోకేష్ కు సమాధి కట్టారు
  • పవన్, లోకేష్, చంద్రబాబు యుద్ధభేరి మొదలెట్టినా జగన్ జైత్రయాత్ర ఆపలేరు
  • ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు అన్నారు
  • 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్‌ఫర్ అయ్యారు
  • లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా...పవన్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడారా?
  • తండ్రి, కొడుకు, పార్ట్‌నర్ ముగ్గురు వలసవెళ్లిన వారే
  • పవన్, లోకేష్, చంద్రబాబు యుద్ధభేరితో జగన్ ను ఏం చేయలేరు : కొడాలి నాని

3.43 PM, గురువారం, Dec 21, 2023
ఎన్ని సార్లు కలుస్తారు? ఎన్ని సార్లు విడిపోతారు? : మంత్రి అంబటి

  • లోకేష్ యువగళం పెద్ద అట్టర్ ఫ్లాప్....ముగింపు సభ అంతకంటే ఫ్లాప్
  • యువగళం ఎవరికోసం చేశారు?
  • 2014లో పవన్ టీడీపీకి సపోర్ట్ చేశారు
  • 2019లో విడిగా పోటీ చేశారు
  • మళ్లీ 2024లో పవన్ టీడీపీతో కలుస్తున్నారు
  • పవన్ తన క్యాడర్ ను మోసం చేస్తున్నారు
  • పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారు
  • చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదు
  • గతంలో చంద్రబాబు, లోకేష్ లను పవన్ ఎన్నోసార్లు తిట్టారు
  • తిట్టిన నోటితోనే పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిసారు
  • లోకేష్ ను బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ పెట్టారా?
  • పవన్ ప్యాకేజీ మాట్లాడుకునే యువగళం సభకు వచ్చారు
  • ముందు రానని, తర్వాత ఎందుకు వచ్చారు? : మంత్రి అంబటి

3.30 PM, గురువారం, Dec 21, 2023
ఇంకా చంద్రబాబు కళ్లు తెరుచుకోవా.?

  • అమరావతి : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : చంద్రబాబు ప్రకటన

నిజమే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కానీ ఆ మార్పులు ఏంటంటే..! : YSRCP

  • ఇక ముందయినా చంద్రబాబు మారాలి, నిజాలు చెప్పాలని కోరుకుంటున్నారు
  • అన్నీ తానే, అంతా తానే నుంచి చంద్రబాబు బయటకు రావాలని కోరుకుంటున్నారు
  • గోబెల్స్‌ ప్రచారం ఇకనైనా ఆపి ఎల్లో మీడియా వాస్తవాలు చెప్పాలని కోరుకుంటున్నారు
  • ఎవరి పాలనలో ఎంత మంచి జరిగిందో నిజాయతీగా చెప్పాలని కోరుకుంటున్నారు
  • తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ తీరులో కాస్త అయినా మార్పు రావాలని చూస్తున్నారు
  • అబద్దాలు, అవాస్తవాలతో జనాల్ని ఏమార్చలేరని గుర్తించారు
  • ఇకనైనా మీరు మారండని ఆశగా ఎదురుచూస్తున్నారు,
  • ఇప్పటికే మిమ్మల్ని కుర్చీ నుంచి మార్చారు, ఇప్పుడు రాజకీయాల నుంచి తొలగిస్తారు

2.01 PM, గురువారం, Dec 21, 2023
టీడీపీలో టిక్కెట్లు అడిగేవారు లేరు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • పవన్ రాకపోతే తమ మీటింగ్‌కి జనం రారనుకునే స్థితికి చంద్రబాబు వెళ్లారు
  • మనుషులంటే ప్రేమ, వారి కష్టాలపై సానుభూతి జగన్‌కే సాధ్యం
  • అందుకే ఈ నాలుగున్నరేళ్లుగా జగన్ సంక్షేమం చేయగలిగారు
  • దానికి అహంకారం అనే పేరు టీడీపీ వారు ఎలా పెడతారు? 
  • 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన స్కీములు ఉన్నాయా?
  • కొత్తగా పార్టీ పెట్టినవారు మాట్లాడితే జనం నమ్ముతారా? 
  • చంద్రబాబు, పవన్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడు ఎందుకు వచ్చింది?
  • ఇప్పుడు ఎందుకు మళ్లీ కలిశారో ప్రజలకు చెప్పాలి
  • వారి మధ్య తెరవెనుక జరిగిన ఒప్పందాలను ప్రజలకు వివరించాలి 
  • జన్మభూమి కమిటీ పేరు వినగానే జనానికి భయం పుడుతుంది
  • అంతగా దోపిడీ చేశారు 
  • రామోజీ, రాధాకృష్ణలాంటి వారు మాత్రమే త్వరగా చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటున్నారు
  • వస్తే మళ్లీ దోపిడీకి తెగపడవచ్చన్నది వారి ప్లాన్  
  • కానీ సాధారణ ప్రజలు ఎవరూ జగన్ని మార్చాలని అనుకోవడం లేదు
  • రీజనల్ పార్టీలో ప్రజలు నాయకుడిని చూస్తారు
  • స్థానిక అంశాలు కొన్ని ప్రభావితం చేస్తాయి
  • చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు అని పవన్ అంటున్నారు
  • మరి సొంతంగా పార్టీ పెట్టుకోవటం ఎందుకు?
  • ఎవర్ని మోసం చేయటానికి ఇదంతా? 
  • పవన్ వెనుక ఉన్నవారు చంద్రబాబుని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారు? 
  • నిన్న స్టేజీ మీద ఉన్న‌ వారి ముఖాల్లో ఏ ఒక్కరిలోనూ సంతోషం లేదు 
  • పవన్, చంద్రబాబులకు ఇక్కడ ఇళ్లు లేదు
  • వారికి ఏపీలో అడ్రస్ లేదు
  • వారికి సపోర్ట్ చేసే మీడియా అధినేతలు కూడా వేరే రాష్ట్రంలో కూర్చుని రాళ్లు వేస్తున్నారు
  • మా హయాంలో సచివాలయాల ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్ లీ ఇచ్చినవి ఉద్యోగాలు కాఅవా? 
  • ఆరున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినవి కనపడటం లేదా? 
  • చంద్రబాబు హయాంలో 30 వేలకంటే ఉద్యోగాలు ఇచ్చారా? 
  • కొత్త ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తుంటే కనపడటం లేదా?
  • చంద్రబాబు హయాంలో ఏం జరిగాయో చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదు? 
  • రెండు రీజనల్ పార్టీలు పీరాటంలో ఉన్నాయి
  • వాటి అధినేతలుఎలాంటి వారీ జనం చూసి ఓట్లువేస్తారు 
  • జనం మీద ఉన్న నమ్మకాన్ని ఈ నాలుగున్నర ఏళ్లలొ మరింత బలం పెంచుకున్నారు
  • అధికారం ఒక హక్కు అని ఇంకా చంద్రబాబు అనుకుంటున్నారు
  • టీడీపీ ని లాక్కున్నారు, పవన్ కి ఎదురు డబ్బు ఇచ్చి తెచ్చుకున్నారు
  • అది తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పలేరు
  • మా పార్టీ నుండి ఎవరూ పక్కకు వెళ్లే అవకాశం లేదు
  • టీడీపీ, జనసేన మధ్యే సరిగా పొంతనలేదు, ఇక బీజేపీని కలపాలని ఎందుకు అనుకుంటారు? 
  • జగన్ చేసి మన్ననలను పొందిన పథకాలను చంద్రబాబు చేయాలనుకుంటున్నారు
  • టీడీపీలో టిక్కెట్లు అడిగేవారు లేరు
  • 175 నియోజకవర్గాలలో పోటీకి ఎవరూలేరు
  • ఒకవేళ ఉంటే ఇప్పటికే వారుకూడా ఎక్సర్ సైజ్ చేయాలి
  • చంద్రబాబు అలా చేయటం లేదంటే ఆపార్టీలో నేతలు ఎవరూ లేరని అర్ధం
  • మా పార్టీలో చాలా ఎక్కువ మందే నేతలు ఉన్నారు
  • వేరే పార్టీల నుండి తీసుకోవాల్సిన పనిలేదు

12.17 PM, గురువారం, Dec 21, 2023
పవన్‌ తీరును చూస్తే నవ్వొస్తుంది: మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

  • యువగళం ఎక్కడ స్టార్ట్ చేశాడో.. ఎక్కడ పూర్తి చేశాడో లోకేష్‌కి అవగాహన లేదు.
  • అన్ని జిల్లాల నుంచి తరలించిన జనాలతో యువగళం ముగింపు సభ మూగబోయింది
  • రోజుకో జెండా పట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరును చూస్తే నవ్వొస్తుంది
  • నిన్నటి దాక జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు.. ఇవాళ్టి నుంచి టీడీపీ జెండా మోయ్యాల్సి వస్తుంది.. వారిని చుస్తే జాలేస్తుంది
  • ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతలు చొక్కాలు పట్టుకుని తన్నుకుంటున్నారు
  • ప్యాకేజీలో తేడాలు వస్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చొక్కా పట్టుకునే రోజు వస్తుంది
  • యువగళం సభ అట్టర్ ప్లాప్‌ను చూసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద ఆశలు చచ్చిపోయాయి
  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుస్తాం

12.01 PM, గురువారం, Dec 21, 2023
సీనియర్ ఎన్టీఆర్‌తో లోకేష్‌ను పోల్చడం ఏంటి?: కేఏ పాల్‌

  • నిన్న యువగళం ముగింపు సభకు వంద మందయినా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా?
  • డబ్బులు, మందు పంచితేనే యువగళం సభకు వచ్చారు
  • లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు..?
  • గుడివాడలో ఎమ్మెల్యే టికెట్‌కి  ఇద్దరి ఎన్నారైల నుంచి 50 కోట్లు తీసుకున్నారా లేదా..?
  • సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు.. అప్పుల రాష్ట్రంగా మార్చారు
  • అప్పుల రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టిక్కిస్తారో నాతో గంటసేపు డిబేట్ చేయాలి
  • ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు.. దానిపై చర్చకు రావాలి
  • చంద్రబాబు ఎందుకు రుణమాఫీ చేయలేదు... ఇప్పుడు ఎలా చేస్తారు?

10.58 AM, గురువారం, Dec 21, 2023
చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దు: మంత్రి రోజా

  • మాటకు కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్‌
  • అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ విస్మరించి, మ్యానిఫెస్టో పార్టీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
  • నందమూరి తారకరత్న చనిపోతే.. యువగళం ముగింపు సభలో కనీసం ప్రస్తావన లేదు
  • నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు అవసరాలకు వాడుకుంటున్నాడు
  • నారా లోకేష్ ఒక ఐరన్ లెగ్
  • లోకేష్ మాటలను ప్రజలు నవ్వుకుంటున్నారు
  • పవన్ కళ్యాణ్‌, జన సైనికులను చూస్తే జాలేస్తుంది

10.48 AM, గురువారం, Dec 21, 2023
పవన్, లోకేష్‌లు కమెడియన్లు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • జగన్‌కి సవాల్ విసురుతూ సినిమాల్లో బ్రహ్మానందం మాదిరిగా కామెడీ చేస్తున్నారు
  • వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు, లోకేష్ పాదయాత్రకు పోలికలేదు
  • టీడీపీ, జనసేన పొత్తు చూసి జగన్ భయపడే పరిస్థితి లేదు
  •  సోనియాగాంధీని ఎదిరించి..ఫైట్ చేసిన వ్యక్తి సీఎం జగన్‌ 
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్‌ భయపడలేదు
  • చంద్రబాబు, లోకేష్, పవన్ కలిసి ఏం సాధిస్తారు
  • ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారో చెప్పలేని వ్యక్తులు పవన్, లోకేష్
  • నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
  • వైఎస్‌ జగన్‌ ఎండా.. వాన... చలిని లెక్కచేయకుండా పాదయాత్ర చేశారు
  • లోకేష్ చేసింది ఓ సరదా యాత్ర
  • నిజంగా లోకేష్ 3 వేల కిలోమీటర్లు నడిచాడా?
  • నిన్న పెట్టిన లోకేష్ సక్సెస్ మీట్‌కు జనం రాలేదు
  • లోకేష్, పవన్, బాలకృష్ణ మాట్లాడుతుంటే జనం పారిపోయారు
  • వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసేందుకు  అభ్యర్ధులు పోటీ పడుతున్నారు
  • విజయవాడ పశ్చిమలో టీడీపీకి నాయకుడున్నాడా?
  • ఇక్కడ ఎవరూ లేరు కాబట్టే ఎంపీ కేశినేని నానిని ఇంఛార్జ్ గా పెట్టారు
  • విజయవాడ ఈస్ట్,సెంట్రల్‌లో జనసేనకు ఇంఛార్జిలెవరో చెప్పగలరా?
  • ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • ప్రజల వాక్కు దైవ వాక్కు
  • ప్యాకేజీల కోసమే పవన్ కళ్యాణ్ పొత్తులు
  • 2019లో చంద్రబాబు, లోకేష్‌తో ఎందుకు విభేదించావ్
  • ఆరోజు చేసిన ఆరోపణలపై తప్పచేశాను క్షమించమని అడుగుతున్నావా?
  • పవన్ పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రాలేదు
  • పవన్ ఇప్పటికైనా నిజస్థితి తెలుసుకోవాలి
  • సినిమాల్లో మాదిరి కేకలు, అరుపులు వేస్తే రాజకీయాల్లో డిపాజిట్లు కూడా రావు
  • మహిళలకు అన్ని విధాలా పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్‌

9.08 AM, గురువారం, Dec 21, 2023
లోకేష్ యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాప్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • పవన్‌ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లయ్యింది ఏం ఉపయోగం? 
  • గాజువాకలో ఏం జరిగిందో.. భీమవరంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
  • మంగళగిరిలో ఏం జరిగిందో లోకేష్‌కు తెలుసు
  • వ్యక్తిగతంగా సత్తాలేక అంతా కలిసి జగన్‌ను ఢీకొట్టాలని చూస్తున్నారు
  • టీడీపీ, పవన్ కలిసి పని చేసిన ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీలేదు
  • సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం 
  • భయం అంటే ఏంటో వైఎస్సార్‌సీపీకి తెలియదు
  • పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఢీకొట్టి నిలబడిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
  • భయం ఎలా ఉంటుందో లోకేష్ కు బాగా తెలుసు
  • తండ్రి అరెస్ట్ అయితే ఢిల్లీ పారిపోయి ఇరవై రోజులు దాక్కున్న వ్యక్తివి నువ్వు
  • నీకు భయముంది.. జగన్‌కి ప్రజాబలం ఉంది
  • ఏ సంబంధం లేకపోయినా అన్యాయంగా అక్రమంగా జగన్‌పై అప్పటి కేంద్రం కేసులు పెట్టింది
  • ఐదేళ్లు పాలనలో అవినీతి చేసి ఆధారాలతో దొరికిన దొంగ చంద్రబాబు
  • చంద్రబాబుపై కక్షసాధించాల్సిన అవసరం మాకు లేదు
  • సీఎం జగన్‌ సిద్ధాంతాలు ప్రజలకు నచ్చేలా ఉన్నాయి
  • రాజకీయ పార్టీలో మార్పులు సహజం
  • సీఎం జగన్‌ ప్రజలకు మేలు చేసే ఒక వ్యవస్థ
  • రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్.. మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి లోకేష్
  • జగన్‌ను మార్చేయాలంటున్న పవన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి

8.20 AM, గురువారం, Dec 21, 2023
పప్పు లోకేశ్‌ వ్యాఖ్యలు విడ్డూరం: బహుజన పరిరక్షణ సమితి

  • యువగళం సభలో అమరావతిపై పప్పు లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు విడ్డూరం
  • అమరావతి పేరుతో నిలువు దోపిడీ చేసిన చంద్రబాబు
  • మళ్లీ అదే తీరులో దుష్ట రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
  • ఏపీలో కానీ, 29 గ్రామాల్లో కానీ కనీసం సొంతిల్లు నిర్మించుకోని బాబు, ఇప్పుడు అమరావతిపై కపటప్రేమ
  • కులం, మతం పిచ్చిలో రైతు­లు, 29 గ్రామాల ప్రజల పొట్టగొట్టిన బాబును న్యాయస్థానాలు విచారిస్తే  బండారం బట్టబ­యలవుతుంది
  • యువగళం పాదయాత్ర ప్రజల కోసం కాదు.. కేవలం లోకేశ్‌ ప్రాక్టీస్‌ యాత్రగా మిగిలిపోతుంది
  • అసమర్థుడైన లోకేశ్‌ను ప్రజల్లో తిప్పితే వీసమంత ప్రయోజనం ఉండదు
  • ఎవరెన్ని కుటిల యత్నాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ విజయం సాధించేది వైఎస్సార్‌సీపీనే

7.38 AM, గురువారం, Dec 21, 2023
సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన

  • ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇళ్లకు వచ్చి బెదిరింపులు 
  • ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు
  • ఆధార్‌ కార్డు ఇవ్వాలని, ఓటీపీ చెప్పాలని బలవంతం
  • అపరిచితులకు సమాచారం ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక 
  • ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు
  • మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం
  • ఆధార్‌ కార్డులు చూపాలని డిమాండ్‌
  • ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి
  • వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులు
  •  ఏలూరు, తణుకు నగరాల్లో ఇంటింటికీ వెళ్లి బెదిరింపులు
  • భయభ్రాంతులకు గురవుతున్న జిల్లా వాసులు
  • గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్‌ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన టీడీపీ.
  • ఇప్పుడు తమ ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు

7.25 AM, గురువారం, Dec 21, 2023
చంద్రబాబుకు ఊహించని షాక్‌!

  • బెడిసికొట్టిన యువగళం ముగింపు సభ ప్లాన్‌
  • టీడీపీ నేత నారా లోకేష్‌ యువగళం ముగింపు సభ అట్టర్‌ ప్లాప్‌
  • యువగళాన్ని ప్రజలు పట్టించుకోని జనం
  • ఎల్లో బ్యాచ్‌ తల పట్టుకునే పరిస్థితి ఎదురైంది
  • టీడీపీని నిరాశకు గురిచేసిన నారా లోకేష్‌ యువగళం ముగింపు సభ
  •  అంచనాలను అందుకోలేని ముగింపు సభ
  • లోకేష్‌ సభకు ఆరు లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన టీడీపీ నేతలు
  • ఉత్తరాంధ్ర నేతలు, ప్రజలు ముఖం చాటేయడంతో తప్పిన ఎల్లో బ్యాచ్‌ అంచనాలు
  • సభకు అనుకున్న సంఖ్యలో జనం రాకపోవడంతో కంగుతిన్న ఎల్లో టీమ్‌ 
     

7.13 AM, గురువారం, Dec 21, 2023
సొంత పుత్రుడి.. ఉత్త యాత్ర

  • ప్రజా స్పందన కరువైన లోకేష్‌ పాదయాత్ర
  • 226 రోజులకే పరిమితమైన పాదయాత్ర
  • 400 రోజులు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటూ లోకేష్‌ ప్రగల్బాలు
  • అవగాహన రాహిత్యపు మాటలతో నవ్వులపాలైన లోకేష్‌
  • చంద్రబాబు ఎవరికి ఇస్తే వారిదే టికెట్‌ అంటూ ప్రకటనలు
     

7.05 AM, గురువారం, Dec 21, 2023
వేడేక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

  • అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో ముందుకెళ్తోన్న సీఎం జగన్‌
  • సింగిల్‌గా పోటీ చేయలేక దిక్కులు చూస్తోన్న టిడిపి, జనసేన
  • పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు, పవన్‌
  • నిన్నంతా సీట్ల లెక్కలో తలమునకలయిన బాబు, పవన్‌
  • పవన్‌ లెక్క 50/5, చంద్రబాబు లెక్క 25/2
>
మరిన్ని వార్తలు