శాసనసభ: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్‌!

12 Mar, 2020 16:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు చూసి కూడా కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ శాసనసభలో గురువారం మాట్లాడారు. 
(చదవండి: శాసనసభ: విమర్శలను తిప్పికొట్టిన హరీష్‌రావు)

విమర్శ మంచిదే కాని, ప్రతిదాన్నీ విమర్శిచడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి సీఎం అన్నారు. నిజాలు ప్రజలకు తెలియాలనే కాంగ్రెస్‌ లేనెత్తిన అంశాలపై సమాధానం చెప్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా అందడం లేదని కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించిన మూడు వేల 9 వందల కోట్లు కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలేనని సీఎం వ్యాఖ్యానించారు.
(చదవండి: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు)

మరిన్ని వార్తలు